పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియేడప ప్రకరణము.


బర్మానుండి తిరిగి వచ్చిన పిమ్మట ఆ సంవత్సరము ఫాల్గుణమా సాంతమున కటకమునకు వెళ్ళియుంటిని. జగన్నాధ క్షేత్రమునకు తీర్థ యాత్రికులు పోవు మార్గములబట్టి అంచీ పాలకీల పై కటకము చేరితిని, అక్కడ నొక గుడిసెలో బస చేసితిని. చైత్రమాసములో కటకము నందు ప్రచండ రౌద్రము. వేడిచే నాయాసము చెందితిమి. అక్కడ నుండి పాండువా' అను ప్రదేశములోనున్న నాజమీందారీ కచ్చేరికి పోయి జమీందారీ పరిదర్శనము చేయుటకు కొంత కాలముంటిని. అచటనుండి రాత్రులందు అంచీ పాలకీల పై సవారి చేయుచు జగన్నాధ దర్శనార్థమై “పూరీ' కి పోయియుంటిని, ప్రభాత సమయమునకు ' పూరి' కనలిదూ రములోనున్న యొక సుందర సరోవరము చెంత చేరితిని. దాని పేరు చందనయాత పుష్కరిణి అని వింటిని. అక్కడ పల్లకీ దిగి ఆపుష్కరిణి యొక్క స్నిగ్ధజలములో స్నానమాడి మార్గాయాసము తీర్చుకొంటిని.


స్నానము చేసి బయటకు రాగానే జగన్నాధుని పండాయొకడువచ్చి నన్ను పట్టుకొనెను. వెంటనే కాలివడకనే యాతని వెంబడి పోతిని. నాకు కాలికిజోడు లేదు. ఇది చూచి పండా మిక్కిలి సంతసించెను దేవాలయమునకు వచ్చు సరికి ద్వారము తాళము వేయబడి యుండెను. ద్వారమువద్ద జనారణ్యము. అందరును జగన్నాధుని చూడ నుత్సుకులై యుండిరి. పండా చేతిలో తాళము చెవులుండెను. అతడు తలుపు తెరవ సాగెను. ఒక తలుపు తెరవగనే దేవాలయములో నొకపొడవైన సావడి కనబడెను. పండా అందులో ప్రవేశించి మరియొక ద్వారము తెరచెను. ఇంకొకసానడి కనబడెను. నా వెనుక నొక వెయ్యిమంది యాత్రికులు లోనికి జొరబడి చివర తలుపు తెరవగనే " జయ్ జగన్నాధ్ ! " అని