పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము,


చేయుచుండిరి. వారియుత్సాహమున పాల్గొని కెప్టన్ మొదలగువారుకూడ మిక్కిలి సంతోషముతో వారివలె నాట్యమాడనారంభించిరి. వారినట్లు వేళాకోళము చేయుటచూచి గుమ్మమువద్ద నిలబడినయొక బర్మా స్త్రీ మదోన్మత్తులైన పురుషుల చెవులలో నేదో యూదెను.వెంటనే వారు సృత్యము వాద్యము మానివేసి యెక్కడికో పలాయితులై పోయిరి. దొరలు వారి నెంతయో అనునయవిసయములతో తిరిగి నృత్యము చేయుడనిరి. కాని వారు వినిపించుకొనక నెక్కడికో పారి పోయిరిబర్మా రాజ్యములో పురుషుల పై స్త్రీలకంత యధికార ముండెను.


నాకతడుతెరచిచూచితిని.అందులో‘మోల్మీన్'కు తిరిగివచ్చితిమి. నేనొక ఉన్నతో ద్యోగియు గౌరవనీయుడు నగుబర్మా పురుషుని చూచుటకు వానియింటికి పోతిని.వినయముతో స్వాగతమిచ్చెను. తివాసిమీదనుండినయొక కుర్చీలో నతడు కూర్చుండెను. నేనుమరియొక కదానిపై కూర్చుంటిని, గది బహువిశాలమైనది. అతని నలుగురు పుత్రికలు నాలుగు మూలల కూర్చుండి యేదో కుట్టుచుండిరి. 'నేనుకూర్చున్నపిమ్మట అతడు “ఆదా”య నెను. అంతట నాపిల్లలలో నెకతే నా చేతిలో ఒకగుండ్రని పొన్గానును పెట్టెను. దానినితాంబూలపు మసొలాదవ్యము లుండెను. బౌద్ధగృహములలో నతిధుల సత్కరించు పద్ధతియిది. ఆయన నాకు వారి దేశములోని యొక సుందరమగు పుష్పవృక్షుపు అంట్ల నిచ్చి నన్ను బహూకరించెను. అశోకమును బోలియుం డెనవి. వానినింటికి తీసికొనినచ్చి తోటలో పొతితినిగాని ఎంత సంరక్షణ చేసినను వానినీ దేశములో బ్రతికింప లేక పోతిని.ఈ చెట్టు పండ్లు బర్మీలకు మిక్కిలి యిష్టము. 'వారివద్ద ఒక బంగారు కాసున్నచో, దానిని ఒక్క పండుఖరీదుగా నిచ్చికూడ దానిని కొందురు.అధివారికంతరుచి; కాని మనకు దానివాసనయైనను గిట్టదు.