పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటి ప్రకరణము.

3

దినములలో మాతండ్రిగారు అలహాబాదునకు సంచారము వెడలిరి. ఇంతలో ఆమెకు దేహమునందస్వస్థత ప్రవేశించెను. వైద్యుడువచ్చి రోగినింక గృహమునందుంచ కూడదని చెప్పెను. కావున ఆమెను గంగానదీ తీరమునకు గొని పోవుటకు మావారలు యత్నముచేయ నారంభించిరి. కాని మాయవ్వకింకను బ్రతుకవలెనని యుండెను. గంగకుపోవుట కామె యిష్టపడలేదు. “ద్వారకానాధుడింటివద్ద నున్నచో నన్నిట్లు బయటకు గొనిపోవ గలిగియుందురా?” అనెను. కాని ఆమాటలు చెవిని బెట్టక ఆమెను గంగాతీరమునకు గొనిపోయిరి. “నామాటలు వినక నన్నిచటకు గొనివచ్చి మీరు నాకెట్లు కష్టమును గలిగించిరో అట్లే నేనును మీకందరకు విశేషకష్టముకలుగ జేసెదను; నేను త్వరలో మరణము నొందను” అనెను. ఆమెను గంగాతీరమున ఒక తాటియాకు పాకలో నుంచిరి. ఆమె మూడు రాత్రులారీతిగ జీవించి యుండెను. ఆ సమయమున గంగాతీరమున సర్వదా నేనామెవద్దనే యుండువాడను.

మాఅవ్వ చనిపోవుటకు పూర్వపు రాత్రి ‘నింతోలాఘాట్’•[1] వద్ద నేను ఆసాల ముందొక చాపపై కూర్చుంటిని. నిండుపున్నమరేయి. ఆకసమున వెన్నెల వెదజల్లుచు చల్లని చందమామ. చెంతనే స్మశానము. అత్యుత్సాహముతో నీశ్వరనామ సంకీర్తనగావింపబడుచుండెను. “ఆహా! ఇటువంటిదినమెన్నడైన వచ్చునా, హరినామస్మరణతో ప్రాణము పోవుచున్నది!” [2]t

ఆనిశాసమయ మందమారుతము నధివసించి ఈగీతములు చల్లగ నావీనుల చేరుచుండెను. అకస్మాత్తుగ నామనసునందొక

  1. కలకత్తానందలి స్మశానవాటికలలో ముఖ్యమైనది.
  2. " ఏమొ౯ది౯ కిహాబే, హరినామ్ బొలియాప్రాణ్ జాబే ,,