పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

మహర్షి దేవేంద్రనాధశాకూర్ స్వీయచరిత్రము.

వింతయైన ఉదాసభావ ముదయించెను. నేను పూర్వపు మనుజుని కానట్లు నాకు దోచెను. ఐశ్వర్యమునందొక్కమారువిముఖత్వము జనించెను. నేను కూర్చుండియుండిన ఆతాటియాకు చాపముందు రత్నకంబళములు, చీని చీనాంబరములు ఏహ్యములుగ దోచెను, మనసునందు మున్నెన్న డెరుంగని నూతనానంద మొకటి యుద్భవించెను. అప్పటికి నావయసు పదునెనిమిదేండ్లు.

రెండవ ప్రకరణము.

ఇంతవరకును నేను విలాసము యొక్క ఆమోదములో మునిగి యుంటిని. తత్వజ్ఞానమును గురించి అణుమాత్రమయిన నాలోచింపలేదు. ధర్శమన నేమియో, ఈశ్వరుడన నేమియో నా కేమియు తెలియదు. ఏమియు నేర్చికొనలేదు. కానినాడు స్మశానవాటిక యందు నేను పొందిన సహజస్వాభావిక ఆనందమును నామనసునందింక ఉంచుకొనలేకపోతిని. భాష సర్వవిధముల దుర్బలమైనది. నేను పొందిన ఆనందమును లోకులకు దెల్పుటెట్లు? అది స్వాభావికానందము. తర్కము వల్లను యుక్తి వల్లను దాని నెవ్వరును పొందజాలరు. దానిని మానవహృదయముల ప్రవహింప జేయుట కీశ్వరుడే తరుణమును వెదకుచుండును. ఇట్లు సమయమును కనిపెట్టి దానిని నాకుదయచేసి యున్నాడు. ఇక ఈశ్వరుడు లేడని యెవడు చెప్పగలడు? ఇదియే ఆయన ఆస్తిత్వ ప్రమాణము. ఇట్టి యానందము పొందుటకు నేను సంసిద్ధుడనై యుండలేదుగదా. మరి నేనెక్కడనుండి దీనిని పొందితిని?

ఈ ఆనంద భావముతోను ఔదాస్య భావముతోను రాత్రి రెండు జాముల వేళ ఇల్లు చేరితిని. ఆరాత్రి నాకింక నిద్రదపట్ట లేదు. అట్లు, నిద్రరాకుండుట కాయానందమే కారణము. రాత్రియంతయు ఈ ఆనం