పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

మహర్షి దేవేంద్రనాధ శాకూర్ స్వీయచరిత్రము.

గృహకృత్యములు చాలవరకు ఆమెయే స్వయముగా నిర్వహించుచుండెను. ఆమె కార్యదక్షతవలన గృహకృత్యములన్నియు సుశృంఖలముగా సాగుచుండెను. ఇంటివారందరును భుజించిన పిమ్మట ఆమె స్వహస్తపాకము భుజించుచుండెను. నేనును ఆహవిష్యాన్నములో భాగము పొందువాడను. భోజనముకన్న నాకీప్రసాదమే ఎక్కువయిష్టముగా నుండెడిది. మా అవ్వకు ధర్మమునందెంత యాసక్తి యుండెనో, కార్యనిర్వహణము నందెంత నైపుణ్యముండెనో ఆమె శరీరముకూడ అంత సౌందర్యముగ నుండెను. వైష్ణవ గోసాయీలు తరుచువచ్చుచుంచుట ఆమెకిష్టము లేకుండెను. ధర్మము యెడల అంధవిశ్వాసముతో బాటు ఆమెకు కొంత స్వాతంత్ర్యముకూడ యుండెను. గోపీనాధ ఠాకూరును చూచుటకు మాపురాతన గృహమున కామెతో వెళ్ళుచుండువాడను. కాని ఆమెను విడిచి మాత్రము బయట గదుల లోనికైనను వచ్చుట కిష్టము లేకుండెడిది. ఆమె యొడిలో కూర్చుండి గవాక్షము ద్వారా శాంతభావముతో సమస్తమును చూచుచుండెడి వాడను.

ఇప్పుడింక మాయవ్య లేదు, కాని ఎంతయో కాలమునకు, ఎంతయో అన్వేషించిన పిమ్మట, నేటికీ అవ్వల కెల్ల నవ్వయగు లోక మాతను కనుగొని ఆమె క్రోడమున కూర్చుండి జగత్తు యొక్క లీలను తిలకించుచున్నాను.

మా నాయనమ్మ తను చనిపోవుటకు కొలది దినముల పూర్వము, “నాకున్నదంతయు నీకుతప్ప వేరెవ్వరికిని యివ్వన” ని నాతో జెప్పెను. పిమ్మట ఆమెపెట్టె తాళము చెవి నా చేతికిచ్చెను. పెట్టె తెరచిచూడగా అందులో నాకు కొన్ని రూపాయలు మొహరీలు, కనబడెను. అపుడు నేనందరతో ‘నాకు అటుకులు మరమరాలు దొరకెన’ ని చెప్పితిని. 1835 వ సంవత్సరమున మఅవ్వ యొక్క అంత్య