పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

మహర్షి దేవేంద్రనాధశాకూర్ స్వీయచరిత్రము,


మెక్కితిని. పాదము లప్పుడు అవశములయ్యెను. ఇంక నాయిచ్చాను మతముగ అడుగులు పడకుండెను. విసిగి వేసారి నేనొక ఎత్తైనరాతి సూద కూర్చుంటిని. ఒంటరిగా నట్లాయరణ్యములో కూర్చుండి ఆయాసముచే కల్గిన చెమట చేతను, బాహ్యమున వర్షము చేతను తడిసి నానుచుంటిని, అరణ్యము నుండి వ్యాఘ్రములు వచ్చునో భల్లూకములు వచ్చు. నోయని భయము కలుగుచుండెను.


ఇటువంటి సమయములో మావటివాడు వచ్చి కనబడెను. “ఏనుగును తీసికొనిరా లేక పోతిని, తమరు ఒంటరిగా వచ్చుచుండుట చూచీ సాధ్యమైనంత త్వరలో మీ వెనువెంటవచ్చితిని” అని అతడ నెను. అప్పటికి నాశరీరమునకు కొంచము బలము వచ్చెను. నా అంగములు తిరిగి వశమయ్యెను. అతనితోమరల పర్వతము నెక్క నారంభించితిని. పర్వతముమీద నెకవిస్తీర్ణమైన సమభూమియుండెను. దానిపై ననేక గుడిసెలుం డెను. "కాని అందొక్క మనుష్యుడైన కనబడ లేదు. కామాఖ్యా మందిరములో ప్రవేశించితిని. అది మందిరము కాదు, పర్వతగ్రహ్వరము. అందులో "నేమూర్తియు లేదు. ఒక యోనిముద్ర మాతముం డెను. ఇది చూచిన పిమ్మట పద పర్యటనముచే పరిశ్రాంతుడనై వెనుకకు వచ్చి బ్రహ్మపుత్రానదిలో స్నానముచేసి ఆయాసమున పనయించితిని. అందలి స్నిగ్ధజలము యొక్క గుణమువల్ల నాశరీరమునకు తిరిగి నూతనశక్తి వచ్చెను. పిన్ముట నాలుగైదు వందలమంది వరుసగా నదియెడ్డున నిలబడియుండి కోలాహలము చేయుచు కన్పించిరి. మీకేమి కావలెనని నేనడిగితిని. వారు “మేము కామాఖ్యా దేవి యొక్క పండాలము. మీరు కామాఖ్యాను చూచివచ్చితిరి గాని మాకేమియు దొరకలేదు, దేవీ పూజ చాలరాత్రి పర్యంతము చేయవలసియుండెను; అందువల్ల ఉదయమున నే లేవ లేక పోతిమి” అనిరి.. నేను “పొండు, నావద్ద మీకేమియు దొరకదు” అంటిని,