పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియైదవ ప్రకరణము.

131



'ఢాకా'కు స్టీమరుమీద వెళ్లి యుంటిని. అక్కడినుండి' మేఘ్నా ' దాటి బ్రహ్మపుత్ర ద్వారా 'గౌహటి' చేరితిని. "


స్టీమరు రేవు చేరగానే లంగరు వేసెను. కమిషనర్ మొదలగు కొందరు గొప్పవారు దానిని చూచుటకు వచ్చినన్ను కూడ కలసి కొనిరి. వారు నాపరిచయము చేసికొని నాతో సంతోషముతో ప్రసంగించిరి. నేను కామాఖ్యాలయమును చూడ పోవుదునని వారందరువిని, వారి వారి ఏనుగులని చ్చెదమని చెప్పసాగిరి. కామాఖ్యాలయమును చూడవలె ననువ్యగ్రతతో నేను తెల్ల వారుజామున నాలుగు గంటలకే లేచి వెళ్లుటకు సిద్ధముగా నుంటిని; కాని ఒడ్డున నాకొరకెన్వరి యేనుగులు లేవు. కమిషనర్ దొర యేనుగు మాత్రము నాకొరక పేక్షించు చుండెను. అతడొక్కడే అన్నమాట నిల బెట్టుకొనెను. ఇదిచూచి ఆహ్లాదితుడనై మొడ్డు చేరి మావటివానితో నేనుగును వెనుక నుండి తీసికొని రమ్మని చెప్పి పదవ్రజములో నడువ నారంభించితిని. కొలదిదూరము నడచి నపిమ్మట ఏనుగు వెనుక బడుచుండుట కనుగొంటిని, మావటివాడు దానినొక చిన్న ఏరు దాటించుటకు ప్రయత్నించుచుండెను. ఇదిచూచి ఏనుగు కొరకు కొంత సేపాగితిని. కాని ఆలశ్యము కాబొచ్చెను. మావటివాడు దీనిని దాటింప లేక పోయెను. నేనిక ఓపిక పట్టి యుండ లేక పోతిని,


పదవజమున మూడుకోసులు నడచి కామాఖ్యా పర్వత పాద ప్రాంతమునకు చేరితిని. విశ్రాంతి తీసి కొనకయే కొండ నెక్క నారంభించితిని. పర్వత పథము ప్రస్తర నిర్మితము. మార్గమున కిరుపక్కలను ఘోరారణ్యము. అయరణ్యము లోనికి దృష్టి చొచ్చుట కవకాశములేదు. దారితిన్నగా పైకిఉండెను. ఆ నిర్జనారణ్య మార్గమునుబట్టి నేనొంటరిగా కొండ నెక్క-సాగితిని. సూర్యోదయమున కింక కొంచము తడవుండెను. కొంచంచముగ వర్షము తొలకరించు చుండెను. కాని నేను దానిని లెక్క సేయక కమముగా ఎక్కుచుంటిని. తృతీయ భాగ