పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము.



ప్రేరణచేసిన దెవ్వరు ? గోధియోయోనః ప్రచోదయాత్." ధర్మార్ధ " కామమోక్షములయం దెవ్వరు మన బుద్ధివృత్తులను పునః పునః ప్రేరణచేయుచుండునో ఆజాగ్రత జీవంత దేవతయే నాహృదయము నందీ సకలసత్యములను ప్రేరణ చేసెను. అవినాదుర్బల బుద్ధి సిద్ధాంతములు కావు. అవి మోహ వాక్యములు కావు. 'ప్రలాపవాక్యములును కావు, అవినాహృదయము నుండి ఉచ్ఛ్వాసితమైన ఈశ్వర ప్రేరిత సత్యములు. ఎవడు సత్యము యొక్క ప్రాణమును సత్యము యొక్క కాంతియునయి ఉన్నా అతనివద్ద నుండి వచ్చి ఈసకల జీవంత సత్యములు నాహృదయము నందవతీర్ణములయ్యెను. అప్పుడు నేనాతని పరిచయము పొందితిని. ఎవరాతనిని కోరుదురో వారాతనిని పొందుదురని తెలిసికొంటిని, నేను కేవలమాతనికొరకు ఏకమనస్సులో వేచియుండుటవల్ల నే ఆతనిపాద ధూళిని , పొందగలిగితిని. ఆ పొదధూళియే నానేత్రములకు అంజన మయ్యెను.


ఆగ్రంథము వాసిన పిమ్మట దానిని పోడశాధ్యాయములుగ విభాగము చేసితిని. ప్రధమాధ్యాయము యొక్క నామము ఆనందాధ్యా యము. ఈవిధముగ బ్రహ్మవిషయకోపనిషత్తు - బాప్తీ ఉపనిష త్తు...తయారయ్యెను. కాబట్టి 'బాహ్మధర్మము యొక్క ప్రధమ ఖండాంతమునందీ విధముగ లిఖంపబడెను... బ్రాహ్మీ భావత ఉపనిషత్ మదమేత్యు పనిషత్ “నీకు ఉపనిషత్తుబోధ చేయబడెను.” ఇది బ్రాహ్మవిషయిక ఉపనిషత్తు.— వేదములను ఉపనిషత్తులను పరిత్యజించితిననియు, వానితో నా కేమియు సంబంధము లేదనియు ఎవ్వడును తలవకుండును గాక. వేదముల యందును ఉపనిషత్తుల యందును ఉన్నసకల సత్యములతోను బాహ్మధర్మము సంఘటిత మయ్యెను. నాహ్రుదయమాసత్యములకు సాక్షియయ్యెను.వేదరూపక కల్పతరువుయొక్క అగ్రశాఖాఫలము యీ బాహ్మధర్మము. వేదము యొక్క