పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

119

ఇరువది మూడవ ప్రకరణము,



"భయాందస్యాగ్ని స్తుతీభయాత్తపతీసూర్యః | భయాడిస్ట్రశ్చవాయుశ్చ మృత్యుర్ధావతిర్దావతి పంచమః.” – ఈపరమేశ్వరుని భయమువలన అగ్ని ప్రజ్వలిత మగుచున్నది. ఇతని భయమువలన సూర్యుడుత్తాపపము నిచ్చుచున్నాడు. 'మేఘము, వాయువు, మృత్యువు ఆయన భీతి వలన సంచారణ గావించుచున్నవి.


ఈరీతిగా నాహృదయమునం దేయే ఉపనిషత్సత్యములు ఆవి ర్భావమయ్యెనో వానినన్నిటి ఒక దానిపిమ్మట నొక దాని సుచ్చరింప దొడగితిని. “యశ్చాయమస్మిన్నాకాశే తేజోమయేగ్మృతమయః పు రుషః సర్వానుభూః| యశ్చాయమస్మిన్మాత్మని తేజో మయేర్మృతమః యఃపురుషః సర్వానుభూః! తమేవవిదిత్వాతి మృత్యు మేలినాన్య పందా”విద్య తేరయనాయ.” ఈ ఆసీను ఆ కాశమునందు ఏ తేజోమయామృతమయపురుషుడున్నాడో అతడన్నిటిని తెలిసికొను చున్నారు. ఈ ఆత్మయందు ఏ తేజోమయామృతమయ పురుషుడున్నాడో అతడు అన్నిటీని తెలిసికొనుచున్నాడు. సాధకులు అతనిని తెలిసికొని మృత్యువు నతిక్రమించు చున్నారు. ముక్తి ప్రాప్తికి తద్భిన్నము అన్యమార్గములేదు---.


ఈ ప్రకారముగా నీశ్వరప్రసాదమువల్ల ఉపనిషత్తుల ముఖము 'బాహ్మధర్మపు పునాదిని నాహృదయము నుండి వెలువడ జేసితిని, 'బాహ్మధర్మ గ్రంధము మూడుగంటలలో ముగిసిపోయెను. కాని దాస్ సర్ధముచేసికొనుటకు నియుక్తుడ నైతి నేని సమస్త జీవితము గడచి పోయినను అది అంతము కాదు. ఈ బాహ్మధర్మము యొక్క సకల సత్య వాక్యములయందు నాకు చలింపని విశ్వాసముండు గాక యని ధర్మప్రవర్తకుడైన యీశ్వరుని చెంత వినీత భావముతో ప్రార్థింతును, ఈగ్రంథము నాహృదయము యొక్క ఉచ్ఛ్వాసము; పరిశ్రమవల్ల కలిగిన చెమట బిందువు కాదు. ఈసత్యములను నాహృదయము నందు