పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది మూడవ ప్రకరణము.

121



శిరోభాగముపనిషత్తులు, ఉపనిషత్తుల శిరోభాగము బ్రాహ్మీ ఉపనిషత్తు-బ్రాహ్మవిషయికోపనిషత్తు. ఇదియే బాహ్మధర్మ ప్రధమఖండములో సన్ని వేశిత మైయున్నది.


ఈయు పనిషత్తులనుండీయే ప్రథమమున నాహృదయములోని ఆధ్యాత్మిక భావములకు ప్రతిధ్వనిపొంది, సమగ్ర వేదమును, సమస్తోపనిషత్తులును, బాహ్మధర్మముసకు ఆధారములుగా చేయుటకు యత్నము చేసితిని గాని అట్లు చెయ్య లేక విచారించితిని. కాని ' నాదుఃఖమనవసరము. ఎందువల్ల ననగా, ఏగనియు పూర్తిగ బంగారముతో నిండియుండదు. గనిలోని అసార ప్రస్తర ఖండము లన్నీటిని చూర్ణము చేసి వానిలో నుండి స్వర్ణము నిర్గతము గావించి తీసికొనవలయును. ఈగనిలోనిహితమై యుండు సమస్త స్వర్ణమును బహిర్గతమైనదని చెప్పుట కాదు.వేదో*పనిషదూషముగ నున్నగనులలో నెన్ని సత్యములో యెన్ని స్థానములయందో గంభీరరూపముగ నిహిత మైయున్నవి. భగవద్భక్తి విశుద్ధ సత్వ సత్య కామ వీరులు ఎప్పుడు అనుసంధానము చేతురో అప్పుడు ఈశ్వర ప్రసాదమువల్ల వారి హృదయము ద్వారా నదిఉద్ఘాటిత మగును. వారు ఆగనులనుండి ఆసకలసత్యములను ఉద్ధరించి తీసికొన గలుగుదురు.


హృదయము ధర్మానుష్టానముచే పవిత్రము చేసికొనిన వారు మాత్రమే బ్రహ్మోపాసనాధి కారము పొందగలరు. ఆధర్మ మెట్టిది ? దానినీతిపది ఏది? ఇదిబాహ్ము లెజిగియుండుట నితాంతావశ్యకము, ఆధర్మనీతి అనుసారముగా వారి ప్రవర్తనలు సవరించుకొనుట యే వారి నిత్యధర్మము కావున బ్రాహ్ములకొరకు ధర్మానుశాసన ముండవలెను, బ్రహ్మవిషయికోపనిషత్తును చదివి యెట్లు బ్రహ్మను తెలిసికొందుగో అట్లే ధర్మానుశాసనము ద్వారా అనుశాసితులై హృదయమును విశుద్ధము చేస కొందురు. బ్రాహ్మధర్మమున మొదటిది యుపనిషత్తులు, రెండవది ధర్మాను శాసనము, బాహ్మధ