పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియవ ప్రకరణము.

97



తోచెను. కొలది కాలము పిమ్మటనే అప్పుల వాండ్ర సభలో ఈ సంగతి తెలియ బరచితిమి, వారు దీనికి విశ్వస్తచిత్తములతోను, ఆహ్లాద పూర్వకముగను సమ్మతించిరి. అటు పిమ్మట కార్యభారము మేమే స్వీకరించి కంపెనీ' కచ్చేరి మాయింటికి మార్చితిమి. ఒక ఆంగ్ల మేనేజరును ఒక గుమాస్తాను నియమించితిమి. Carr, Tagore & Co యను గాలిపడగ దారమును మా గృహగోపురము నుండి యే చుట్టనారంభించితిమి. తుదవరకు చుట్ట గలుగుదుమో, మధ్య దారిలో నది తెగి పోవునో యని మాత్రము సంశయ ముండెను.


ఇరువదియవ ప్రకరణము.

వారణాసికి పంపబడిన నలుగురు విద్యార్థులలో నానంద చంద్రుడు నాతోకలకత్తాకు మరలి వచ్చెను. అప్పటికతడు కళ, ప్రశ్న,ముండక , ఛాందోగ్య, తలవ కార, శ్వేతాశ్వతర, వాజసనేయోపనిషత్తులను, బృహదారణ్యకోపనిషత్తులో నొక భాగమును చదివెను. వేదాంగములో నిరుక్తము, ఛందము, సటీక నూత భాష్యమును, వేదాంతపరిభాష, వేదాంతసారము, అధికరణమాలా, సిద్ధాంత లేష, పంచదళి, సటీకాగీతా భాష్యము చదివెను. కర్మమీమాంసలో తత్వకాముదీ చదివెను. తక్కిన ముగ్గురిలోను ఋగ్వేద విద్యార్థియగు రామనాధభట్టాచార్యుడు ఋగ్వేద సంహితలోని ఏడవ అష్టకము మూడవ ప్రకరణము వరకు, తద్వ్యాఖ్యానములోని ప్రధమాష్టకములో ఆరవఅధ్యాయ మువరకును ముగించెను. యజుర్వేద విద్యార్ధియగు వాణీశ్వర భట్టా చార్యుడు మధ్యందిన సంహితలో 8 ప్రకరణములు, తైత్తిరీయ సంహి తలో రెండవ అధ్యాయము వరకును, కణ్వ భాష్య ప్రథమ భాగము