పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

మహర్షి దేవేంద్రనాధఠాకూర్ స్వీయచరిత్రము.


యుంటిని. ఇప్పుడు వానిని నాజీవితములో భోగించుచుంటిని. రాహువునుండి విముక్తమైన చంద్రుని వలె నాయాత్మ ప్రపంచము నుండి విముక్తమై బాహ్మలోకము ననుభవించెను. "హే ఈశ్వరా ! 'అతులశ్వర్యము మధ్య నాయాత్మ నిన్ను పొందక యుండి విలపించుచుండెను.ఆప్పుడు నిన్ను పొంది తిని; గాన సర్వమును పొందితిని.


ఈదినములలో ఉదయము మొదలు రెండు జాముల వరకు గభీర దర్శన శాస్త్ర చింతనలో నిమగ్నుడనై యుండువాడను. మధ్యాహ్నము మొదలు సాయంత్రము వరకు వేదములు, వేదాంతము, మహా భారతము మొదలగు శాస్త్రముల ఆలోచన యందును, ఋగ్వేదమును బంగాలి లోనికి భాషాంతరీకరించుట యందును నియుక్తుడనగు చుంటిని. సాయం కాలము మీద ఒక ప్రశస్తమైన కంబళి పై కూర్చుందును. అచ్చట బ్రాహ్మజిజ్ఞాసువులగు బాహ్ములు, ధర్మజీజ్ఞాసుపులగు సాధులు నావద్దకు వచ్చి కూర్చుండి నానాశాస్త్రాలోచనలు సలుపుచుండిరి. ఈ యాలోచనలతో నొక్కొక్కప్పుడు రాత్రి రెండు జాములు కూడ దాటుచుండెను. ఈ రోజులలో 'తత్వబోధినీ' పత్రికా వ్యాసములు కూడ సరిచూచుచుంటిని.


మా కంపెనీ పతనము చెందిన మూడు నాలుగు మాసములలో గిరీంద్రుడు నాతో నిట్లనియెను:" ఇంతకాలమైనది. ఋణము కొంచమైన తీర్పబడుటయే లేదు. దొరలు కూర్చుండి జీతములు మాత్రము తినుచుండిరి. ఈ విధముగా అప్పులు తీరునని ఆశ పడరాదు. ఇదే విధముగ వ్యసహారము నడచుచుండినచో మన యిండ్లువాకిళ్ళు అమ్ముకొనినను ఋణవిముక్తులము కానేరము. "కాబట్టి వ్యవహారము మన చేతిలో నుంచినచో మన పప్రయత్నములతోను, అల్పవ్యయములతోను అనతి కాలములోనే బదుళ్లు తీర్చెదమని సంఘముతో చెప్పవలెనను కొనుచున్నాను. ” నాకిది మిక్కిలి చక్కని ఆలోచనగా