పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము


లోని 13 ప్రకరణములను, ద్వితీయ భాగములోని 25 ప్రకరణములను నేర్చికొనెను. సామ వేద విద్యార్ధియగు తారానాగ భట్టాచార్యుడు సామ వేదములో "వేయగానములో 86 సామములును, అరణ్యగానము నాల్గవ ప్రపాదకమును, ఉహగానములో పడవ ప్రపాదకమును, ఉత్తర భాష్యములో ఆరవ భాగములోని శ్రీ వసూక్త భాష్యమును, కర్మమీమాంసమును, వేదాంతములో శాస్త్ర దీపిక యొక్క జూతి ఖండనమును చదివెను. ఈ నలుగురిలోను ఆనంద చంద్రుడే శాస్త్ర పండితుడనియును, శ్రద్ధావంతుడనియును, నిష్టావంతుడనియు చూచి, వేదాంతవాగీశుడని అతనికి బిరుదమునిచ్చి అతనికి బాహ్మసమాజ ఉపాచార్య పదవిని చ్చితిని.


వేదాలోచనవలన పురాతన ఋషీశ్వరులు పూజ చేసినది కేవలము ప్రకృతియందున్న, సూర్య, చంద్ర, అగ్ని ర్వాయువులు కావని గ్రహించితిని. వారు ఏకేశ్వరునే అగ్నిర్వాయు రిత్యాదిరూపముల బహుప్రకారములుగా నుపాసించు చుండిరి. కావుననే ఋగ్వేదము లోనిట్లుండెను;

“ఏకం సద్విప్రాబహు ధావదంత్యగ్నిం యమం మాతరి శ్వాస మాహ్యు” ||


"అతడొక్కడే కాని ఋషులు వేరు వేరుగా అగ్నియనియు, వాయువనియు, యముడనియు బహుప్రకారముల పిలచు చుందురు.”అట్లే యజుర్వేదములో “ఏషఊ హ్యేవసర్వే దేవతాః " _ దేవతలందరును అతడే' యని ఉండెను.


ఈ వేదమునందు దృష్టి ఉంచియే నాఋగ్వేద భాషాంతరీకరణ ముయొక్క భూమికలో నిట్లనీ వ్రాసితిని. " సూర్యుని అంతర్యామి యెవ్వడో అతడే సూర్య దేవత. అగ్ని యొక్క అంతర్యామి ఏపురు షుడో అతడే అగ్నిహోత్రుడు. ” దీనిని బట్టి వైదికులు సూర్యాది