పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదు నెనిమిదవ ప్రకరణము.

91


విచిత్రము. ఈసకల వాక్యములవల్లనే ఉపనిషత్తులకు మహత్వము. ఉపనిషత్తులలోనున్న, “సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ”, “స్వసుపర్ణా స యుజ సభాయా” మొదలగు నవన్నియు ఋగ్వేదములోనివి. అందు లోనుండి ఉపనిషత్తులు గ్రహించినవి. వేదములలో మిగిలిన వన్నియు నశించినను యీ సత్యములు మాత్రమెన్నటికి నశించవు.


ఈ సత్యస్రోతము ముందుకు ప్రవహించుచు ఉపనిషత్తులు ఋషీశ్వరుల జీవితములోనికి ప్లావితమై పవిత్ర పరచి ఉన్నతము గావించెను. ఈ సత్యమునుండియే వారి జీవితము సంఘటిత మయ్యెను. దీనినుండి వారు అమృతాస్వాదము పొంది ముక్తి మార్గము సందగ్రేసరులైరి. ఈసత్యముల ప్రభానమువల్ల నే ముక్త హృదయములతో నిట్లనిరి.


“వేదాహమేతం పురుష మహాస్త మాదిత్యవర్ణం తమసః పరస్తాత్ |
త్వమేవవిద్యాతి మృత్యు మేతీ నాన్యః పస్థావిద్యతే అయనాయ" ||


" నేనీ తిమిరాతీతజ్యోతిర్మయ మహాపురుషుని తెలిసికొంటిని, కేవలము అతనిని తెలిసికొనియే మృత్యువు నతిక్రమించు చున్నారు. తద్భిన్నము మృత్యు ప్రాప్తికి అన్యఫథము లేదు.”


ఇదియే పరావిద్యయనియు, ఈ పరావిద్యా విషయము “ఏకమే వాద్వితీయం” బహ్మయే అనియు గ్రహించితిని.