పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము


“ సృష్టికి పూర్వము మృత్యువు, అమృతము ఏదియు లేదు. రాత్రి లేదు, పగలు లేదు, విజ్ఞానము సహితము లేదు. తన స్వశక్తివల్లనే జీవించుచు ఈశ్వరుడొక్కడే యుండెను. ఆతడుతప్ప వేరేమియు లేదు. ఈప్రస్తుత ప్రపంచమప్పుడు లేదు.” ఏఋషులు తపోప్రభావము చేతను, ఈశ్వర ప్రసాదము వల్లను బ్రహ్మమును తెలిసికొనిరో వారీ ప్రకారము నుడివిరి.


“జ ఆత్మదా బలదాయ స్య విశ్వ ఉపాస తేపశిషం యస్య దేవా!!
యస్యచ్ఛాయా హమృతం యస్యమృత్యుః కస్మై దేవాయహ విషావిధామ."


“ఎవ్వని విధానమును విశ్వసంసారము పాసించుచున్నదో, దేవతలు ఎవ్వని విధానమును పాసించు చున్నారో, ఆయన ఆత్మదాత, బలదాత. అమృతము ఎవ్వనిఛాయయో, మృత్యువు ఎవ్వని ఛాయయో అతనికి తప్ప ఇంకే దేవతకును మేము హవిస్సు దానము చేయము ! అతడు ఈ సృష్టినంతయు చేసి యున్నాడు. అతనిని మీ రెరుగరు. అతడు నీ అంతరమున నివసించి యున్నాడు. అన్యులకిది తెలియదు.”


“సతంవిదాఖజాయ మాజజానాన్యత్ యుస్మాకమస్తరం వభువ|
నీహారేణప్రావృతా జల్ప్యాసుతృపకుభాసొసశ్చరాంతి | "


"అజ్ఞాన నీహారము ద్వారా, వృధాజల్పన ద్వారా, ఇటునటు తిరుగుచు సర్వదా వాద భేదములలో మునిగి తేలుచు, ఇందియ సుఖములచే సంఎత్ష్టిచెందుచు, యజమంత్రములతో" అనుశాసింప బడి యుండు వారికిదెట్లు తెలియగలదు? బ్రహ్మజిజ్ఞాస, బాహ్మజ్ఞానము, బ్రహ్మతత్వమ..... ప్రాచీనఋగ్వేద యజుర్వేదములలోనివియెట్లు ఉజ్వల రూపముతో ప్రకాశించుచున్నవో చూడుము. ఉపనిషత్తులలో ఈసకల నుహావాక్యములు ప్రాచీన 'వేదములో నున్న వను విషయము కడు