పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము

పందొమ్మిదవ ప్రకరణము.



వారణాసినుండి వచ్చు సరికి 'కంపెనీ' (Carr, Tagore & Co) శిధిలావస్థలో నుండెను. సొమ్ము కొరకు ‘బిల్లులు' వచ్చుచుండెను. కాని వానికి తిరిగి చెల్లించ సలసిన సొమ్ము దొరకుట దుర్లభముగా నుండెను. విశేష ప్రయత్నము తోడను, మిక్కిలి కష్టముతోను ప్రతిదినము సొమ్ము చెల్లింపబడు చుండెను. ఇకను ఎన్నాళ్లీ విధముగ గడపుట. ఇట్లుండ ఒక దినము 30,000 రూపాయల కొక బిల్లు వచ్చెను. సొమ్మింట లేక పోయెను.ఆదినము సంధ్యా సమయమైనది. కాని సొమ్ము చేర లేదు. ఆ ' బిల్లు ' తెచ్చిన వాడు కాగితముతీసికొని సొమ్ము 'లేకయే మరలి పోయెను. అప్పటినుండి మా Carr, Tagore& Co సంభ్రమ మెగిరి పోయెను. కచ్చేరి తలుపులన్నియు మూయబడెను.


1847 వ సంవత్సరము మార్చిలో Carr, Togere & Co వాణిజ్య వ్యాపార మడుగంటెను, నావయసృప్పటికి 30 సంవత్సరములు. ముఖ్యోద్యోగియగు D, M. Gordon సలహా ననుసరించి, అప్పుల వాండ్రకొక సభ గావింపఁబడెను. కంపెనీ కట్టి వేసిన మూడు దినములకు వారందరు మూడవ అంతస్తుపై సమావేశమైరి. Gordon మాఅప్పు ఆస్తిపట్టిక తయారు చేసి సభ వారి ముందుంచెను. మాఅప్పు మొత్తము కోటి రూపాయలున్నట్లు తెలియ జేయబడెను. మాకు రావలసినది 70 లక్షలు. కాబట్టి 30 లక్షలు తగులు బాటున్నవి. సభవారి నుద్దేశించి అతడిట్లనియెను. " కంపెనీదార్లు వారి స్వంత ఆస్తి కూడ నిచ్చుటకు సిద్ధముగా నున్నారు. కంపెనీ కున్న ఆస్తి రాబడులను, జమీందారుల స్వంత సొమ్మును మూయధికారములో నుంచికొని మీ మీ బాకీలను తీర్చికొనుడు, కాని వారికి హక్కు. లేనటువంటి 'ట్రస్టు'