పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము.



కాని అగ్నిర్వాయురింద్ర సూర్యాద్య నేక దేవతా విగ్రహములున్నట్లు గాంచితిని. దీనికి చేతులు, కాళ్ళు, శరీరములు మొదలగునవి లేకున్నను అవి మన ఇంద్రియములకు మాత్రము ప్రత్యక్షము. వానిశ్చక్తి నందరు ననుభవించు చుందురు. దీనికి సంతుష్టి కలిగింపకున్నచో అతివృష్టి అనావృష్టుల చేతను, సూర్యుని ప్రచండ ఉత్తాపము చేతను, వాయువు యొక్క.. ప్రబల వీవనలవల్లను, తుపానుల వల్లను సృష్టి నశించునని వైదికులు నమ్ముచుఁడిరి.'నాటి యనుగ్రహముతో జగత్తునకు. నిలకడ, వాటి యూగ్రహముతో జగత్తునకు వినాశము. కావున వేదములలో అగ్నిర్వాయుగంద సూర్యాదులు ఆరాధ్య దేవతలు. కాళీ, దుర్గ, రాముడు, కృష్ణుడు వీరందరు తంత్రములలోని, పురాణములలోని ఆధునిక దేవతలు. కాని అగ్ని ర్వాయురించి సూర్యాదులు మాత్రమే వేదముల లోని పురాతన దేవతలు. యాగయజ్ఞముల మహాడంబర మంతయు వీరికొరకే. కావున కర్మకాండను పోషించు 'వేదముల సహాయమున బ్రహ్మోపాసన ప్రచారము చేయవలెనన్న యాశ ఒక్క సారిగా పరిత్యజింపవలసి వచ్చెను.


ఇక వేదముల పరిత్యజించితిమి. కానీ గృహస్థులముగ నుండియు సన్యాసుల మైతిమి, మాగృహకృత్యములలో నింక అగ్నికి వేదవి హితమగు ఆధిపత్యము లేదు. కాని పూర్వ కాలపు బాహ్మవాది ఋషీ,శ్వరులు సర్వమును పరిత్యజించి సన్యాసులగు చుండిరి. వారు యాగయజ్ఞములను త్యజించిన పిమ్మట ఇంట నుండ లేక పోయిరి. జ్ఞానవిరోధమైన యజ్ఞముల ఆడంబరము యెడ విరక్తి చెంది ముక్తిన న్వేషించుచు ఏకముగా ఆరణ్యమునకే పోవుచుండిరి. అరణ్య మధ్యమునకు పోయి పుత్రులకన్నను విత్తముకన్నను ప్రియతముడైన బ్రాహ్మతో వారచ్చట ఐక్యము చెందుచుండిరి. ఇందియ గోచరమైన దేవతల ఉపాసనఁయందు విరక్తి చెందుచుండిరి. ఉపనిషత్తులు అరణ్యమునకు చెందినవి. అరణ్య