పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునెనిమిదవ ప్రకరణము.

87


అతడు యజము ఉష మొదలగు వారు ముఖ్యులు. వేదము యొక్క క్రియలన్నిటీలో నగ్నియుండును. అగ్ని లేనిదే దేవతలకు యజ్ఞము చేయుట వలను పడదు. యజ్ఞములందు అగ్ని దేవత కేవలము సంస్తవనీయుడు మాత్రమే కాడు, యజ్ఞము యొక్క పురోహితుడు. రాజు యొక్క, పురోహితుడు ఎట్లు రాజు కొరకు అభీష్టము సంపాదించునో, అట్లే అగ్నియు యజ్ఞము యొక్క- పురోహితుడై హోమము సంపాదించును. ఏయే దేవతలకుద్దే శింపబడి అగ్నియందు హవిస్సు సమర్పింపబడునో ఆయా దేవతలకు దాని నగ్నియే పంచి పెట్టు చుండును. "కావున నాతడు పురోహితుడే కాక దేవతల దూతగకూడ నుండును. మరియు హవిస్సును దానము చేసి భక్తులేయే దేవతల వద్ద నుండి ఎయే ఫలములకు స్మాత్తులగుదురో వానిన న్నింటినిఅగ్ని యొక భాండారమువలె నుండి వారి వారికి పంచి పెట్టుచుండును అగ్ని దేవత "కార్యముల నేకములు, వేదములలో అగ్ని దేవత యొక్క. ఏ కాధిపత్యమే. ఇంతియేగాక ఈయగ్ని లేనిదే మనగృహకృత్యము లెవ్వియు నెర వేర్చుటకు వలను పడదుగదా. జాతకర్మ మొదలు అంత్యక్రియలు, శాద్ధకర్మల వరకు అన్ని కార్యములయందు అగ్ని, అగ్నివివాహము యొక్క సాక్షి, శూదునకు వేదములయందేయధి కారము లేక పోయునను సాక్షి గానుండుటకు అగ్నిమాత్ర ముండవలెను. దానియందు వారు అమంత్రిత హవిస్సును మాత్రము సమర్పింప వలెను.


మనలో అగ్ని దేవత కింత యాధిపత్యమున్నట్లు పూర్వము నేనెఱుగను. నా బాల్య కాలము నుండియు సాలగ్రామము లేనిదేమాత్రము కార్యము జరుగ కూడక పోవుట నెఱుగుదును. వివాహాద్యనుష్టానము లందు సాలగ్రామము. పూజాపర్వములయంచు సాలగ్రామము. సాల గ్రామము మన గృహదేవత, సర్వత సాలగ్రామమును చూచి దాని దేవ కాధిపత్యమనుకొంటిని. సాలగ్రామమును, "కాళీదుర్గ పూజలను మాని వేసినంతమాత్రమున విగ్రహారాధన పరిత్యజించినట్లే యనుకొంటిని,