పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునెనిమిదవ ప్రకరణము,

89


ములోనే అవి కల్పింపబడినవి. అరణ్యములోనే అవి ఉపదేశింపబడినవి. అరణ్యము లో నే అవి నేర్పబడినవి. వాటిని ఇంటివద్ద పఠించుట సహితము నిషేధింపబడి యున్నది. ఈయుపనిషత్తులు మా చేతిలోనికి ప్రధమముననే వచ్చెను.


కాని ప్రాచీన ఋషులుకూడ అగ్ని, వాయువు మొదలగు ఈ పరిమిత దేవతలకు యాగయజ్ఞములు సల్పి ఆత్మ సంతుష్టి పొంద లేదు.వారిలో కూడ ఈ దేవత లెందుండి వచ్చిరని జి-సబయలు వెడలెను. ప్రపంచ రహస్యమునుగూర్చి వారిలో మహాందోళన బయలు దేరెను.. వారిట్లనుకొసరి. “ఈయద్భుతమైన సృష్టి ఎందుండి బయలు వెడలినదో ఎవరు సరిగా చెప్పగలరు? ఇవన్నియును ఎక్కడ జన్మించినవో యెరైన చెప్పిరా? సృష్టి పిమ్మటనే యీ దేవతలు జన్మించిరి. అట్టితరి ఎవరి నుండి ఈజగత్తు ఉత్పన్నమైనదో ఎవరి కెరుక?” ఋషులు ఎప్పుడు ఈ సృష్టియొక్క నిగూఢ తత్వము కొంచము తెలిసికొసజాలక పోయిరో, వారెప్పుడు శాంతిహీను లైవిషాదాంధ కారములో మూహ్యమాను లైరో, అప్పుడు వారు _స్తబ్ధులై ఏకాగ్రచిత్తముతో జ్ఞానమయ తపస్సాధన నిరతులైరి. అప్పుడు దేవ దేవుడగు పరమ దేవత ఏకాగ్రచిత్తులును, స్థిర బుద్ధి యుక్తులును అగు ఋషుల సిర్మలహృదయములలో ఆవిర్భూతమై మనస్సునకును బుధికిని అతీతమైన జ్ఞానజ్యోతిని ప్రసాదించెను. దానితో ఋషీశ్వరులు జానతృప్తులును సంతుష్టాంత రంగులు నై ఈసృష్టి యెదుండి వెలువడినదో, ఎవ్వరీసృష్టి రచనను గావించిరో తెలిసికొనిరి. అప్పుడు వారి యుత్సాహ సహాయమున ఋగ్వేదములోని మంత్రమును వ్యక్తము గావించిరి.


“నుృత్యురాశీ దమృతం వతన్ సరాత్యాఅహ్న అసీత్ ప్రకోతః |
అనీదవాతం స్వదయాళ దేశం తస్మాధ్యాన్యన్న పరః కించ నాన్|"