పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/66

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
51
కేశవచంద్రసేనుఁడుశ్వర భజన ధ్యానాదులయందుఁ గాలము గడపవలయును. ఈనవీన పద్ధతులఁజక్కగ జనులకు బోధించుట కతనికవకాశము లేకపోయెను. ఏలయన 1883 వ సంవత్సరము మొదలు కేశవచంద్రుఁడు రోగపీడితుఁడై కొంతకాలము బాధపడి తుదకు 1884 వ సంవత్సరమున జనవరి 8 వ తారీఖున లోకాంతర గతుఁడయ్యెను. మతవిషయమున నభిప్రాయభేదము లెట్లున్నను నీదేశోపకారి యకాల మరణమునకు వగవని వారు లేరు. అతని మరణవార్త యింగ్లండు దేశమునందు దెలసినపుడు శ్రీవిక్టోరియారాణిగారు వాని మరణమునువిని చింతిలి తత్కుటుంబము నోదార్చుచు తమ ప్రతినిధియగు రవను ప్రభువుద్వారా వర్తమాన మంపిరి. గవర్నరు జనరలుగారగు రైపన్ ప్రభువుగారును కేశవచంద్రుని మరణము హిందూదేశమునందంతట విషాదము గలిగించెనని వాని కుటుంబమున కుత్తరమువ్రాసిరి. హిందువు లొక్కరు గాక యింగ్లీషువారును వానిసుగుణములఁగూర్చి యొండొరులమించు నట్లు స్తోత్రముఁజేసిరి. ఆసంవత్సరము 30 వ జనవరు సాయంకాలము కలకత్తామందిరమున కేశవచంద్రుని జ్ఞాపకార్థమొక గొప్పసభచేయబడెను. దానికి దొరతనమువారియాలోచన సభలో, నగ్రగణ్యులగు సర్ విలియం హంటరు దొరగా రగ్రాసనాధిపతులైరి. అన్ని మతములను వారలన్ని తెగలవారు వానిమతము గూర్చి శోకించి యుపన్యాసముల నిచ్చిరి. బి. యే. మొదలగు శాస్త్రపరీక్షలయందుఁ గృతార్ధులైన విద్యార్ధులకుఁ బట్టము లొసఁగు కాలమున వారికి హితోపదేశముఁ జేయుచు ఆనరబిల్ రెయినాల్డ్సుదొరగారు సందర్భవశమున కేశవచంద్రుని పేరెత్తి వానియోగ్యతనుగ్గడించి వాని మార్గము నవలంబించి యంతవాండ్రు గ్రమ్మని నొక్కి చెప్పెను.

అంద దన్నివిధములఁ గొనియాడుటకు నాతనియందలి సద్గుణములె కారణములు గాని వేరొకటిగాదు. అతఁడన్న దమ్ములతోబంచు