పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

మహాపురుషుల జీవితములు



కొన్న ధనమంతయు బీదలగు బ్రహ్మసమాజ మతస్థులకై వ్యయముఁ జేసెను. ఇంతకంటె నౌదార్యవంతులఁ జూడఁగలమా ; హిందూదేశమునఁ బూర్వ మహర్షులయొక్క పరిశుద్ధాస్తిక మతమును నిర్మల వర్తనమును వైరాగ్యమును నెలకొలుపుటకై జీవితమునంతయు నతఁడు ధారవోసెను. అంతియెగాని కొందఱనుకొనునట్లు తమ స్వమతాభిమానము లేనివాఁడు గాఁడు. మంచియెచ్చటనున్నను గ్రహించుట మనుష్యధర్మమని నమ్మి యాయన యితర మతములయందలి శ్రేష్ఠధర్మములపైసైతము గౌరవముఁ జూపెడివాఁడు. త్రాగుబోతు తనము తలయెత్తకుండ నడచుటకును దిక్కుమాలిన వితంతువుల నొక్కకడ జేర్చుటకును నథోగతినున్నస్త్రీల నున్నతదశకుఁ దెచ్చుటకును భగవంతునియెడ నిజమైన భక్తి నెలకొల్పుటకును నాయన మిక్కిలిపాటుపడియెను. దొరతనమువారిచ్చు బిరుదము కెన్నఁడతఁ డాసపడఁడయ్యె. బంగాళా గవర్నరురొకమారతని కలకత్తాకు మ్యునిసిపల్ కమీషనరుగా నియమింపఁదలంప నత డాగౌరవము నంగీకరింపడయ్యె. విక్టోరియా రాణీగారు హిందూదేశ చక్రవర్తిని యైననడుమ ఢిల్లీలోజరిగిన దర్బారులో దొరతనమువారతనికి బంగారు పతకము నీయరాఁగా దాని స్వీకరింపఁడయ్యె.

ఇందూరుసంస్థాన ప్రభువగు హోల్కారు మహారాజుగారు జయపూరు మహారాజుగారు మొదలగు మూర్థాభిషిక్తులు తన్ను ప్రాణస్నేహితునిగాఁ జూచుకొని యాదరించు నాఁడును గేశవచంద్రుడు నిగర్వియై యనేక సేవకులున్నను దనయన్నము దాను వండుకొనుచు సామాన్యులతోఁ గలసి మెలసి వారిసుఖ దుఃఖములు తనవిగా ననుభవించుచుండె. అతని విగ్రహ మాఱడుగుల పొడగుగలది. బాహువులు దీర్ఘములు, వక్షస్థలము విశాలము అతని ముఖవర్చసు జనుల నాకర్షించునదియై రాజకళను గలిగియుండును.