పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/65

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
50
మహాపురుషుల జీవితములుయనుచరు లావివాహమునకు సమ్మతించవలదని కేశవచంద్రునితో నొక్కి చెప్పినను వారిమాటలను వినక యతఁడది యీశ్వరాదేశమని చెప్పి దాటఁజూచినను దన కుమార్తెకు మంచి సంబంధము దొరికినది గదా యను కక్కురితిచేత స్వమత ధర్మములు సరకుసేయక యనుచరుల హితోపదేశముల లెక్క గొనక లోకనింద కొడిగట్టి నిర్మల మగు తన వర్తనమున కొక మచ్చ దెచ్చుకొనెను.

కేశవచంద్రసేనుఁడు మొదట తన యల్లుఁడు బ్రహ్మమతస్థుఁడు గాకున్నను క్రమక్రమమున నతఁడు తన మతమునఁ గలియవచ్చుననియు ధనవంతుఁడగుటచే నతని కలయికవలన స్వమతము ప్రబలము కావచ్చుననియుఁదలఁచి యీవివాహమున కంగీకరించెనని కొందఱి యభిప్రాయము. అట్లయినచో నతని యుద్దేశ్యము కొంతవఱకుమంచిదనియే యొప్పవచ్చును. అతని యనుచరుల కిదివఱకే లోలోపల రవులుచున్న యసూయాగ్ని యీవివాహమూలమున పెద్దమంటయై ప్రబలెను. అప్పుడు పండిత శివనాథశాస్త్రి మొదలగువాని యనుచరులు కోపించి కేశవచంద్రసేనుఁడు బ్రహ్మసమాజమునకుఁ ప్రధానాచార్యుఁడుగ నుండఁదగఁడనివానిం దొలగింపఁ బ్రయత్నించిరి. కేశవచంద్రుఁడు పోలీసువారి సహాయమును గైకొని ప్రతిపక్షులఁ బారదోలి స్వస్థానమును బలపరచుకొనెను. వెంటనే శివనాధశాస్త్రి ప్రముఖులు కేశవచంద్రుని హిందూదేశ బ్రహ్మసమాజమునుండి విడిపోయి సాధారణ బ్రహ్మసమాజమును 15 వ మేయి 1878 వ సంవత్సరమున స్థాపించుకొనిరి.

1880 వ సంవత్సరము మొదలుకొని కేశవచంద్రుఁడు నవీన సిద్ధాంతమని మతమునందు మునుపున్న దానికంటె క్రొత్తపద్ధతుల కొన్నిఁటిఁజేర్చెను. ఈసిద్ధాంతమునుబట్టి మనుష్యు డధికవైరాగ్యమును బూని లోకమును సంబంధ సాధ్యమైనంత వఱకు విడచి పరమే