పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/59

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
44
మహాపురుషుల జీవితములుయొప్పుకొనెను. ఈయుపన్యాసములు కలకత్తలో సంక్షోభమును గలిగించెను. కేశవుఁడు కొద్దికాలములో తన మతమునఁ గలియునని క్రైస్తవులు తలంచి యుప్పొంగిరి. అతఁడు క్రైస్తవుఁడై మతభ్రష్టు డగుచున్నాడని హిందువులు నిందించిరి. కాని యచిర కాలములోనే యతఁడు చేసిన మఱియొక యుపన్యాసములో యేసుక్రీస్తు దక్కిన మతోద్ధారకుల తోటిపాటివాఁడేగాని యంతకంటె నెక్కువవాఁడు గాఁడని చెప్పినప్పుడు క్రైస్తవులు తెల్లబోవుటయు హిందువులు సంతసించుటయు సంభవించెను. పిమ్మట కేశవచంద్రుడు మతబోధ సేయుటకై తూర్పు బంగాళాదేశమంతయుఁ దిరుగ పూర్వాచార ప్రియులగు పండితజనుల కతనియందుఁ గలిగిన గౌరవమునుజూచి తమ మతమును గాపాడుకొనఁ జొచ్చిరి. ఆప్రదేశమునుండి వచ్చిన పిదప బ్రహ్మమతస్థులీశ్వరో పాసనముఁ జేయుటకుఁ దగిన తావు లేకుండుటఁ జూచి 1866 వ సంవత్సరమున 24 వ జనేవరు దినమున బ్రహ్మ మందిరము నిర్మించుటకు శంఖుస్థాపన చేయించెను.

ఇది కట్టించిన వెనుక నతనియొడ జనులకు గౌరవమధికమయ్యె, తరువాత రెండుమాసములకు బ్రయాగ, బొంబాయి మొదలగు ననేక నగరముల కరిగి సంఘమత సంస్కారములఁగూర్చి వినువారి మనస్సులు పరవశములగు నట్లుపన్యసించి మాన్ఘీరు నగరమును జేరెను. ఇక్కడనుండగా నితఁడు బ్రహ్మమతములో గొప్పమార్పును దెచ్చి పెట్టెను. ఇంతవరకు బ్రహ్మమతస్థులు సాధారణముగ బ్రార్థనము చేసితమలోదాము భగవధ్యానము చేసికొనుటయే కాని యుత్సవము లెఱుఁగరు.

అది మొదలు బ్రహ్మమతస్థులు పాటలు పాడుచు భజనలు సేయుచు నగరమున నుత్సవములు చేసి జనసామాన్యమున కీమతముపై నిష్టమును భక్తియుఁ గలుగునట్లు చేసిరి. ఇందుచేఁ గేశవుని