పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/58

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
43
కేశవచంద్రసేనుఁడు

చిరి; కాని కేశవచంద్రునకు దేవేంద్రనాథ మహర్షి తనయింట బస యిచ్చి యాదరించి వెల్తి లేకుండజేసె. అది మొదలు బ్రహ్మసమాజ మతస్థులకు భార్యలు సహచారిణులుగ నుండి సభలకు వచ్చి ప్రాముఖ్యతను గాంచుచు వచ్చిరి. కాలక్రమమున సఖ్యతకుదురఁ గేశవచంద్రుఁడు పితృగృహము బ్రవేశించుటకుఁ బెద్దలు సమ్మతించిరి.

అనంతరము కేశవచంద్రసేనుఁడు స్వమతబోధనమునకై బొంబాయి చెన్న పట్టణము మొదలగు మహానగరములకుఁ బోయెను. ఆస్థలములయం దతని కమిత గౌరవము జరిగెను. ఆ పురములయందు బ్రహ్మసమాజమతము స్థాపింపబడియె అక్కడనుండి యాతడు కలకత్తాకు వచ్చిన పిదప దేవేంద్రనాథునకును గేశవచంద్రునకును నభిప్రాయ భేదములుగలిగి యవి తుదకు వివాదముగ బరిణమించెను. ఆభేదకారణ మిది. కేశవచంద్రునకు స్త్రీపునర్వివాహములు సలుపుట నన్యజాతులతోడి వివాహసంబంధములు చేయుట న్యాయమనియు కర్తవ్యమనియుఁ దోఁచ వానికి బ్రోత్సాహము చేసెను. దేవేంద్రనాథున కీరెండును బొత్తుగఁ గిట్టవు. అంతియ కాక కేశవచంద్రుఁడు బ్రహ్మమతస్థులు యజ్ఞోపవీతము ధరింపఁగూడదనియు నది తీసి వేయవలయుననియు పట్టు బట్టెను. కాని దేవేంద్రనాథుఁడేమార్పును లేశము నంగీకరింపడయ్యె. ఈవివాదములు క్రమక్రమముగ వృద్ధినొంద కేశవచంద్రుడును వాని మిత్రులు కొందఱును 1866 సంవత్సరమున నాది బ్రహ్మసమాజము నుండి విడిపోయి 11 వ నవంబరు 1866 వ సంవత్సరమున తమ సమాజమునకు హిందూ దేశ బ్రహ్మసమాజమని పేరుపెట్టి యంతటి నుండియుఁ దామునమ్మిన యామతమును బోధింప నారంభించిరి. ఆయేడు మార్చినెలలో నతఁడు యేసుక్రీస్తు జీవితమును గూర్చి యద్భుతమగు నుపన్యాసమునుఁజేసి యం దేసుక్రీస్తుయొక్క సద్గుణములు గొనియాడి యతఁడు సామాన్య మనుష్యునివంటి వాఁడుగాక దివ్యపురుషుఁడని