పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/387

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
326
మహాపురుషుల జీవితములుసించువాఁడను. ఇటీవల ప్రెసిడెన్సీకాలేజీలో నాయదృష్టమువల్ల వానికిఁ బరిచితుఁడ నైతిని. ఒక్కసారియైన మామైత్రికి భంగము గలిగినట్లు నేఁ దలఁపను. ఏదాని కతఁ డలంకారమై యుండునో యట్టి విద్యాశాఖలోనున్న యుద్యోగస్థు లందఱు మీతో సమానదుఃఖితులై మీదుఃఖము వారిదుఃఖముగ నెంచుకొనుచున్నారు.

ఈ విధముగానే గోపాలరావు కుమారునకు విద్యావంతు లనేకులు పరామర్శ జేయుచు జాబుల వ్రాసిరి. "మీతండ్రి యకాలమరణమునకు గలిగినంత దుఃఖము మఱియొకరికిఁగలుగ" దని రంగనాథము మొదలియారు వ్రాసెను. హైకోర్టు జడ్జీయైన ముత్తుస్వామి యయ్యరుగూడ నీక్రిందివిధమున జెప్పెను. "నేను మొట్టమొదట వానిని 1854 వ సంవత్సరమున గలిసికొంటిని. అది మొదలు చివరవరకు నొక్కవిధముననే వానియందు గౌరవము భక్తియు గలిగియుంటిని. ఆయనబుద్ధి మిక్కిలిగొప్పది. దానినిముప్పదియేండ్లు కృషిచేసి వృద్ధి బొందించెను. ఆయన విద్యాసామర్థ్యము పాఠశాలలోఁ జదువుకొనుట వలనగాక స్వపాండిత్యమువలనను బరిశ్రమవలనను గలిగెను. ఆబుద్ధికి నాపాండిత్యమునకు నిష్కళంకమైన సత్ప్రవర్తనముం దోడుచేసి తన విధికృత్యమును శ్రద్ధతోనెరవేర్చెను ఆయన మహావిద్యావంతు లెట్లుండవలయునో యట్లుండెను" చెన్నపురి క్రిష్టియన్ కాలేజీ ప్రధానోపాధ్యాయుఁడగు రెవరెండు డాక్టరుమిల్లరు తనకాలేజీ పక్షమున బ్రకటింపఁబడు క్రిష్టియన్ కాలేజీ పత్రికలో గోపాలరావును గూర్చి ప్రశంసించెను. దక్షిణహిందూస్థానవాసుల యభిప్రాయమున మిక్కిలి గొప్పవాఁడగు గోపాలరావు మరణమునుగూర్చిన విచారములో నే నితరులలో గలియుచున్నాను. కీర్తి శేషుఁడైన యాతడు తనదేశస్థుల ప్రవర్తనమును సరిగా బోతబోయుటలోఁ జాలకృషి చేసెను. పాఠశాలాపరీక్షకుఁడుగాను మంచి యుపాధ్యాయుఁడుగాను