పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తండాళం గోపాలరావు

325

తుఁడై బాధపడెను. అతని శరీరస్థితి తృప్తికరముగా నుండనందున 1885 వ సంవత్సరమున నతఁ డాఱుమాసములు సెలవుపుచ్చుకొని కుంభకోణమునకుఁ బోయెను. ఈసెలవునుండి యాయన తిరిగి యెన్నఁడు బనిలోఁ జేర లేదు. కుంభకోణమునఁ గొన్నినాళ్ళుండునప్పటికి రోగము క్రమక్రమముగ తగ్గుటకుమారు ప్రబలముకాఁగా తగిన చికిత్సకొఱకు బంధువులు వానిని జెన్నపురికిఁ దోడ్కొనివచ్చిరి. గోపాలరావు చెన్నపట్టణమందె 1886 వ సంవత్సరం మేనెల 11 వ తారీఖునఁ గాలధర్మ నొందెను.

ఆయనమరణ మెల్లవారిని దుఃఖింపఁజేసెను. చెన్నపురి రాజకీయ కళాశాలాధికారులు వానిశక్తికి వానిచేసిన పనికి మెచ్చుచు మరణమునుగూర్చి మిక్కిలి విచారించిరి. అప్పటిడైరక్టరగు డాక్టరు డంకను వానిమరణముంగూర్చి దొరతనమువారికి వ్రాయుచు నీక్రింది విధమున వానింగూర్చి ప్రశంసించెను. "గోపాలరావు విద్యా శాఖలో 1854 వ సంవత్సరమునఁ బ్రవేశించి యిప్పటికి ముప్పది రెండేండ్లు సేవ చేసెను. ఈదీర్ఘకాల మతఁడు దొరతనమువారికి లోకమునకుఁ జాల మేలుచేసెను. అతఁడు గొప్పశాస్త్రజ్ఞుఁడయ్యు నాంగ్లేయభాషా పాండిత్యమునకుఁ మిక్కిలి ప్రశంసచేయబడుచు వచ్చెను. ఇంగ్లీషు భాషాగ్రంథావళి బోధించుటలో గొప్పయూరపియనులతో బోల్చునపుడు గూడ నతఁడు ప్రథమగణ్యుఁడై యుండువాఁడు. కొన్ని సంవత్సరముల నుండి ప్రెసిడెన్సీ కాలేజీలోను యూనివరుసిటీలోను వానితో గలిసియుండు భాగ్యము నాకులభించినందున వానిమరణము వలన గలిగిన విశేషనష్టమును నేను తెలిసికొన గలిగితిని." ఆ సంవత్సరమే మేనెల 26 వ తారీఖున డాక్టరు డంకను గోపాలరావు జ్యేష్టపుత్రున కీక్రిందిజాబు వ్రాసెను. "నేను ఆయనను చాలసంవత్సరముల నుండి యెఱుఁగుదును. వాని సద్గుణములకు నీతికిఁ జాల సంత