పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/308

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
[33]
257
గాజుల లక్ష్మీనర్సు శెట్టిమార్పులఁజేసిరి. అందు ముఖ్యమైనవి, హిందూదేశములో గొప్ప యుద్యోగములు పరీక్షలయందుఁ గృతార్థులైనవారికేగాని యధికారులకుఁ దోచినవారి కియ్యగూడదు. అదివఱకున్న సాదరుకోర్టులుపోయి హైకోర్టులు వానిస్థానమందు వచ్చెను. అంతలో హిందూదేశమున గొప్ప సిపాయిపితూరీ 1857 సంవత్సరమునఁ బుట్టుటచే 1858 వ సంవత్సరమునఁ హిందూదేశప్రభుత్వమును స్వయముగా నింగ్లాండు దేశపు రాణీగారగు విక్టోరియాగారే వహించిరి."

పచ్చయప్ప మొదలియారను సత్పురుషు డొకడు సత్కార్యముల నిమిత్తము లక్షలకొలది రూపాయలిచ్చి చనిపోయెను. ఆ ధనమునకు గొందఱు ధర్మకర్తలేర్పడి పాఠశాలలు మొదలైనవి పెట్టించిరి. లక్ష్మీనర్సు శెట్టిగారు పరోపకార పారీణు డగుటచే ధర్మకర్తగా నుండదగినవాఁడని తక్కినవారు వానింగూడ నందు చేర్చుకొనిరి.

ఇట్లు ప్రజాపక్షము వహించి పనిచేయుటచే లక్ష్మీనర్సు శెట్టి రాజద్రోహి యనియు విశ్వాసపాత్రుఁడు గాఁడనియు దొరతనమువారు భావించి యతడిచ్చిన యుపన్యాసములను మిక్కిలి శ్రద్ధతో శోధించుచు నతడెక్కడికి బోయిన నక్కడకు వెంటవెంట పోలీసు వారిని బంపుచుండిరి. 1857 వ సంవత్సరమున జరిగిన సిపాయి పితూరీకిఁ గారణము దొరతనమువారు మతసంబంధము కలుగ జేసికొనుటయే. అటుపిమ్మట నట్టి మత సంబంధము కలుగజేసికొనవద్దని శెట్టి గవర్నమెంటువారికొక మహజరు పంపించెను. ఆ మహజరు మిక్కిలి బాగుండెనని శ్లాఘించి యింగ్లాండులోని యధికారులు వారి యాలోచనము నంగీకరించిరి. ఇట్లు కొంతకాలము గడచునప్పటికి మునుపు శెట్టిగారిమీఁద ద్వేషముపూనిన దొరలు క్రమక్రమముగా నుద్యోగములు ముగించుకొని స్వదేశములకు పోవుటచేతను శెట్టిగారి