పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/309

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
258
మహాపురుషుల జీవితములుమీద లోకుల కంతకంత కనురాగము హెచ్చుచుండుట చేతను దొరలలో గొందఱు సయితము వానిధైర్యమునకు వాని పరోపకార చింతకు నద్భుతము నొంది శ్లాఘించుటచేతను, అప్పటి చెన్నపురి దొరతనమువారు వానిని నిందింపమానిరి. మానుటయేగాక యా దొరతనమువారు వానిచేసిన దేశోపకారముల మెచ్చుకొనుచు వానికి సి. యస్. ఐ. అను బిరుదము నిచ్చి గవర్నరుగారి శాసననిర్మాణసభలో నొక సభికుడుగ 1863 వంసంవత్సరమున నేర్పరచిరి. ఈ పదవియందు వాని నుంచుట సమస్తమతములవారికి సమస్త జాతుల వారికి దృప్తికరముగ నుండెను.

అటుమీద లక్ష్మీనర్సుశెట్టి తన దృష్టి మైసూరురాజ్య వ్యవహారములవంక నిలిపెను. ఇంగ్లీషువారు మైసూరును జయింపబోయినప్పుడు హైదరాబాదు నిజాముగారి సహాయమును బడసి మైసూరు సంస్థానము స్వేదేశరాజున కీయకపోయిన పక్షమున నిజామును దామును గలసి పంచుకొనునట్లొడంబడిక చేసుకొనిరి. లక్ష్మీనర్సుశెట్టి మైసూరుసంస్థాన మింగ్లీషువారు దాని రాజున కప్పగింపనిష్టములేకున్న వారని తెలిసికొని స్వయముగ మైసూరువెళ్ళి వృద్ధరాజును దర్శించి వంశపరంపరగ నుండునట్లు పుత్రుం బెంచుకొమ్మనియుఁ బెంపు స్థిరపరుప దొరతనమువారిని నొక్కి యడుగవలసినదనియు వానికి హితోపదేశము చేసెను. ఒక వేళ నింగ్లీషువారు మైసూరు రాజుయొక్క పుత్రస్వీకారము నంగీకరింపక బోవుదురేమో యను భయమున లక్ష్మీనర్సు హైదరాబాదు నిజాముగారి మంత్రియు సుప్రసిద్ధుఁడు నగు సలారుజంగును గలిసికొని మైసూరుసంస్థానము రాజునకు దొరతనమువా రియ్యనియెడల వెనుకటి యొడంబడికను బట్టి నిజామునకు సమముగా బంచిపెట్టవలసినదని యడుగుమని యాయనం బురికొల్పెను. అప్పుడింగ్లీషువారు మైసూరు రాజుయొక్క పుత్రస్వీకా