పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/215

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
178
మహాపురుషుల జీవితములు

వయసుగాని విద్యగాని లేదు. నైనను వానితల్లి మిక్కిలి బుద్ధిశాలిని యగుటచే బాలుఁడు చెడిపోవకుండ ధనము క్షయముగాకుండ నెంతయు జాగరూకతతో మెలంగి ప్రాయము వచ్చిన తరువాత ద్రవ్యమంతయుఁ బుత్రున కప్పగించెను. అది మొద టతఁడు వ్యాపారములయందు మిక్కిలి శ్రద్ధాళువై ధనవృద్ధి జేయుటయేగాక సంఘమున కెంతో యుపకారియయ్యెను. అతఁడు యావజ్జీవము విదేశములకు సరకు లెగుమతిసేయుటయు నచ్చటనుండి వచ్చిన సరకులు స్వదేశమునకు దిగుమతిచేయుటయు ముఖ్యవ్యాపారముగ బెట్టుకొనెను. ఇతఁడు గుజరాతీలలో భట్టియాకులస్థుఁడు. ఆ తెగలో భాగ్యవంతులగువారు తప్పక వస్త్రములయంత్రములనో మఱియేయితర యంత్రములనో తెప్పించి వ్యాపారము సేయుచుందురు. ఇతఁడో వారి మార్గము ననుసరింపక క్రొత్తపుంత ద్రొక్కెను. అతఁడు చేసిన ప్రతివ్యాపారమున వానికి లాభము విశేషముగావచ్చెను. ఎంతధనము సంపాదించినను గోకులదాసు ధనగర్వమునొందక సర్వజన సులభుఁడయి యెల్ల వారికిష్టుడై యుండెను. అతఁడు సంఘసంస్కరణమునం దభిలాష కలవాఁడని చెప్పుదురు గాని యావిషయమున జెప్పఁదగిన పనియెద్దియు జేసినట్లు కనఁబడదు. ఇతఁడు ముఖ్యముగ దానమునకు బ్రసిద్ధికెక్కెను. 1854 వ సంవత్సరమున నతఁడు మొట్ట మొదట జన్మభూమికి బోయి యచ్చటనున్న తన తెగవారి యుపయోగము నిమిత్తము లక్షరూపాయిల నొక్కమారే దానముచేసెను. ఆ మరుచటి సంవత్సరమే గోకులదాసు తీర్థయాత్రలు సేయఁబోయి యా పుణ్య క్షేత్రములలో గొన్నిచోట్ల చెరువులు త్రవ్వించి కొన్ని తావుల సత్రములు గట్టించి కొన్నియెడల నన్నప్రదానములు సేయించి మొత్తముమీఁద ధర్మకార్యముల నిమిత్తము రెండు లక్షలరూపాయిలు వ్యయపరచెను. అక్కడనుండి వచ్చి గోకులదాసు బొంబాయిలో నున్న