పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[23]

177

గోకులదాసు తేజ్‌పాలు

గుజరాతిదేశములో ప్రసిద్ధమగు కచ్చి యను సంస్థానము గలదు. అందు కొఠారా యను చిన్నగ్రామము గలదు. ఆగ్రామమునం దొక బీదకుటుంబమున నిద్దరు బాలురు పుట్టిరి. అందొకఁడు 1793 వ సంవత్సరమున జన్మించెను. రెండవయతఁడు 1798 వ సంవత్సరమునఁ బుట్టెను. అందు జ్యేష్ఠుఁడగు నాంజి పదియేండ్లప్రాయముననే తనపొట్ట పోసికొనుటకు బొంబాయికిఁ బోవలసివచ్చెను. పాప మతఁడు పగలు వీధులవెంబడి తిరిగి గుడ్డలమ్ముకొని రాత్రి యొక యింటికిఁ గావలిపండుకొని జీవయాత్ర గడపనారంభించెను. ఎన్ని యవస్థలఁబడినను రోజుకూలియైనను సరిగా గిట్టకపోవుటచే నతఁడు చాలశ్రమపడుచు వచ్చెను. ఆతని తమ్ముఁడగు తేజపాలు రెండేడ్ల తరువాత బొంబాయికిఁ బోయి యన్నను కలిసికొనియె. అతఁడు గూడఁ జాల పరిశ్రమజేసి తన యిరువదియవయేట వర్తకుఁడయి స్వతంత్ర వ్యాపారముచేసి ముప్పదివేల రూపాయలు గడించి రమారమి పదునొకండు సంవత్సరములు వయసుగల కుమారుఁ డొకఁ వత్సరమున కాలధర్మమునొందెను. మృతినొందు నప్పటి కతనికి రమారమి పదునొకండు సంవత్సరములు వయసుగల కుమారుఁ డొకఁ డుండెను. అతఁడే గోకులదాసు తేజపాలు. ఆ బాలుని దురదృష్టముచేతఁ దండ్రిపోయిన కొలఁది కాలములోనే పెదతండ్రియగునాంజిగూడ లోకాంతరగతుఁ డయ్యెను. మరణ మొందునప్పటికిఁ నాంజివద్ద మూడు లక్షల రూపాయి లుండెను. నాంజికిఁగూడ బిడ్డలు లేకపోవుటచే వాని ధనమంతయు గోకులదాసునకే జెందెను. ఈ గొప్ప యాస్తిని సరిగాఁ జక్క పెట్టుటకు వానితండ్రియుఁ బెదతండ్రియు సంరక్షకు నెవ్వని నేర్పరచిపోనలేదు. స్వయముగా జక్క పెట్టుకొనుటకు వానికిఁ దగిన