పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/209

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
174
మహాపురుషుల జీవితములుమీలోకోపకార పరాయణత మీరీ బిరుదునకు తగుదురని ఋజువు చేసినవి. అందుచేత నెంతో సంతోషముతోనే నీబిరుదములను మీకిప్పుడు సమర్పించుచున్నాను. ఈబిరుదులు చిరకాలమువహించుటకు భగవంతుడు మీ కాయు రారోగ్యము లొసంగుఁగాక," 1875 వ సంవత్సరమున విక్టోరియా రాణిగారు వానికి సర్ అనుబిరుదమునిచ్చిరి. ఈ బిరుదుపొందిన హిందువులలో నితఁడే మొట్ట మొదటివాడు. ఆ సంవత్సరమందే విక్టోరియారాణిగారి జ్యేష్టపుత్రులును మనప్రస్తుత చక్రవర్తిగారు నగు ఎడ్వర్డుగారప్పుడు యువరాజుగానుండి మనదేశమును జూడవచ్చి బొంబాయి నగరమునకుఁబోయి మంగళదాసు యొక్క యిద్దఱుకుమారుల వివాహమహోత్సవ కాలమునను స్వయముగ వచ్చి వానిని గౌరవించెను. యువరాజుగారు స్వయముగ నింటికి వచ్చిన గౌరవము హిందువులలో మంగళదాసునకుఁ దప్ప మఱి యెవ్వరికిని లభింప లేదు. మంగళదాసు నింటికి వివాహము నిమిత్తము వచ్చిన చుట్టము లందఱు మహానందభరితులయిరి. తనకు గలిగిన యీ యపూర్వ గౌరవముచేత మహానందభరితుడయి మంగళదాసు తనకృతజ్ఞతను యువరాజునకు దెలుపుకొనెను. యువరాజును జూచుట కాసమయమున వర్తకు లనేకులు వచ్చిరి. ఆవచ్చిన వారిలో లక్షాధిపతులు కోటీశ్వరులు నగువారిం గొందఱిని యువరాజునకు జూపి పిమ్మట వాని కత్తరు పన్నీరు తాంబూలములిచ్చి వారినిబంపెను. ఆ సమయమున మంగళదాసునియింట పువ్వులు కుప్పలు కుప్పలయి పడెను. తనయింట జరిగిన వివాహము యువరాజదర్శనము నను నీ రెండుసంగతుల జ్ఞాపకార్థము మంగళదాసు బొంబాయినగరములో నిరువదియైదువేల రూపాయలు మూలధనముతో నొక సత్రము వేసెను. ఆ మూలధనము పేరు సర్ మంగలదాసు నాథూభాయి కపూ నిరాశ్రయల్ నిధి. అదిగాక మఱి యిరువదియైదు వేల రూపా