పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/210

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
175
సర్. మంగళదాస్ నాథూభాయియిలు మూలధనమిచ్చి గుజరాతీ కోమటులందఱి యుపయోగము నిమిత్తము వాకేశ్వరయను గ్రామమున నొక యన్నసత్రము వేయించెను.

1877 వ సంవత్సరమున శ్రీ యువరాజుగారు హిందూదేశమును జూచినందులకు కొందఱిని గౌరవింపదలచి దొరతనమువారు కొన్ని వెండిపతకములు చేయించి యందొకదానిని మంగళదాసు కిచ్చిరి. ఆపతకమును మంగళదాసున కప్పటి బొంబాయి గవర్నరు గారగు సర్ రిచార్డుటెంపిల్ దొరగారు స్వయముగా సమర్పించుచు నా సమయమున నిట్లని చెప్పిరి. "శ్రీ రాణీగారిచేత నీయబడిన యీ పతకమును మంగళదాసునకు సమర్పించుట కింతకన్న మంచి సమయము దొరకదు గనుక నిప్పుడే యీ మిత్రులయెదుట దీని నిచ్చుచున్నాను. అతని నిదివఱకే నెఱింగియుండిన యీ తెల్లదొర యొక్కయు స్వదేశస్థులయొక్కయు సముఖమున మంగళదాసు దేశమునకు బొంబాయినగరమునకు దనసంఘమునకుఁ జేసినయుపకారములను వాని యౌదార్యమును వాని మనశ్శుద్ధిని వేరే నేను వేయినోళ్ళ బొగడ నక్కరలేదు. ఇంగ్లీషువారి యధీనములోనున్న హిందూస్థానములో నెల్ల శ్రేష్ఠమైనది గుజరాతీదేశము. ఆ దేశస్థులలో మిక్కిలి గొప్పదియగు కోమటి తెగలో జేరినవాఁడు మంగళదాసు. అతని సంఘమునకు నతను తగిన ప్రతినిధియని మీరందఱొప్పుకొనఁదగిన యంశమే, గడచిన నూరుసంవత్సరములనుండి వాని బూర్వులు దొరతనమువారిచేతఁ బ్రజలచేతఁ జాల గౌరవింప బడుచున్నారు. ఏటేట వారి యైశ్వర్యము వృద్ధి యగుచున్నది. ఇతఁడు బొంబాయి సంఘమునకు ప్రధాన పోషకుఁడు. ఈయన బొంబాయి రాజధానికి వెనుకటి గవర్నరుగారకు సర్ బార్టిల్ వ్రయర్‌గారి యాలోచనసభలో నెనిమిదేండ్లు సభ్యుడుగా నుండెను.