పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/208

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
173
సర్. మంగళదాస్ నాథూభాయిదక్కిన కమీషనర్లకును సరిపడనందున నతఁడాపనిని స్వల్పకాలములోనే మానివేసెను. మంగళదాసునకు రాజకీయ వ్యవహారముల యందుగూడ జాల నభిలాషకలదు. అట్లుండుట చేతనే యతడు 1867 వ సంవత్సరమున 'బోంబే ఎసోసియేషను' అను నొకసంఘమును స్థాపించెను. ఈ సంఘము యొక్క ముఖ్యోద్దేశము హిందూ దేశస్థులకు రాజకీయవ్యవహారముల యందభిరుచి పుట్టించుటయే, ఈ కార్యములు చేయుటచేత నతఁడు ప్రజల విశ్వాసమునకు బాత్రుడయి బొంబాయి గవర్నరుగారి యాలోచన సభలో సభ్యుఁడుగాఁ బ్రజలవలన నేర్పరుపబడి యెనిమిది సంవత్సరము లాపని చేసెను. ఆ కాలములో జరుగు ప్రతివిషయమునుగూర్చి యతఁడు గాఢముగాఁ జర్చించుటయేగాక ప్రజాక్షేమముకై యధికారులతో నిర్భయముగ బోరాడుచు వచ్చెను. 1874 వ సంవత్సరమున మంగళాదాసు దేహారోగ్యము సరిగాలేక నాపని మానుకొనినప్పుడు బొంబాయి గవర్నమెంటువారీ క్రిందియుత్తరమును వ్రాసిరి.

మీరు గవర్నరుగారి యాలోచనసభలోఁ జిరకాలము కష్టపడి పనిఁజేసి యిప్పుడు మానుకొనుచున్నందుకు లోకోపకారార్థముగ మీరు చేసిన పనినిగూర్చి మేము ప్రశంస జేయకపోవుట పాడిగాదు' 1872 వ సంవత్సరము 1 వ మే తారీఖున బొంబాయి గవర్నరుగారగు సర్ సేమోరీఫిర్జరాళ్డు దొరగారు మంగళదాసునకు సి. ఎస్. ఐ. అను బిరుదమునిచ్చుచు నీ క్రిందివిధముగాఁ జెప్పిరి.

"మంగళదాసుగారూ! ఈ బిరుదమునకుఁ దగిన యుత్తమ పురుషులపేళ్ళు కొన్ని డెలియజేయుమని పై యధికారులు నన్ను గోరగా నేను శ్రీవిక్టోరియా మహారాజ్ఞిగారికి సంతోష పూర్వకముగా మీపేరు వ్రాసిపంపితిని. దయాస్వరూపిణియగు శ్రీవిక్టోరియామహాదేవి గారు నాచేసిన విన్నపము నాదరించినారు మీ స్వతంత్రప్రవర్తనము