పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/18

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
[2]
9
రాజారామమోహనరాయలుగొన్ని మహజర్ల వ్రాయించి వానింజేకొనిఁ స్వయముగ పార్ల మెంటు వారికి సమర్పింపఁ దలఁచి 1830 వ సంవత్సరము నవంబరు 15 వ తారీఖున నతఁ డింగ్లాండునకుఁ బయనమయి పోయెను. మన మెఱిఁగినంతవఱకు సముద్రయానము చేసిన బ్రాహ్మణులలో నితఁడే మొట్టమొదటివాఁడు. ఆతనికీర్తి యతనికన్న మున్నే యింగ్లండునకుఁ బోయి నెలకొనియుండుటచే వాని నందఱు గారవించిరి. రాజ దర్శనము స్వయముగఁ జేయుటయేగాక యాయన పట్టాభిషేక సమయమున, రామమోహనరాయ లన్య దేశపు రాయబారులతో సమానముగ గౌరవింపఁబడెను. ఆ కాలమునం దా దేశంబున నున్న కవీశ్వరుఁలు, తత్వరాస్త్రజ్ఞులు, చరిత్రకారులు, ప్రకృతశాస్త్ర పండితులు వాని పరిచయము చేసికొనుట గౌరవ హేతువనియెంచి, స్వయముగ వచ్చి చూచియు, జాబులువ్రాసి బ్రత్యుత్తరముల దెప్పించుకొనియు దనివినొందిరి. హిందూదేశపు రాజకీయవ్యవహారముల విషయమయి రామమోహనుఁడు పార్ల మెంటు కమిటీవారివద్ద కడు నిపుణముగ, సాక్ష్యమిచ్చెను. సహ గమనము నుద్ధరింపవలయునని ఛాందసులు పంపినమహజర్లు పార్ల మెంటుసభవారు విచారణ సేయునపుడు రామమోహనుఁడు స్వయముగ నచటనుండి తానుతెచ్చిన మహజర్లు వారికి సమర్పించి, చెప్పవలసినసంగతులఁ జెప్పి యా యాచారము రూపుమాయునట్టు చేసెను. 1831 వ సంవత్సరమున నాతఁడు ఫ్రాన్సుదేశముబోయి యచట కొంతకాలముండి ఫ్రెంచి భాష నేర్చికొనెను. అచట నున్న కాలములో నతఁడు ఫ్రెంచిరాజును సందర్శించి రెండుమూడుమారు లాయనతో విందు లారగించి గౌరవ పాత్రుఁడయి యింగ్లాండునకు మరలవచ్చి యాంగ్లేయభాషలో కొన్ని గ్రంథములు వ్రాసెను. ఆగ్రంథముల శైలికిని, నిపుణత్వమునకును, మంచిమంచి యింగ్లీషుకవులు వానినుగ్గడించి మెచ్చుకొనిరి. ఇట్లు యూరపుఖండములో సుప్రసిద్ధుఁడయి కీర్తిగాంచిన, యీమహాపురు