పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/168

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
[18]
137
మానమోహన ఘోషుబంగాళీకవి మధుసూదనదత్తునకు మానమోహనుఁడు చేసిన సాయ మింతింతయనరానిది. మధుసూదనదత్తు మరణకాలమున తల్లి లేని తన యిరువురు కుమారులను సంరంక్షింపుమని మానమోహనున కప్పగించెను. పరమదయాళువగు మానమోహనుఁడు తనమిత్రుఁడు చరమావస్థలో చేసిన ప్రార్థనమును మనసున నుంచుకొని యా బాలకుల సంరక్షణకై యొక చిన్నసంఘము నేర్పరచి విద్యాబుద్ధులు చెప్పించెను. మానమోహనుని దయచేతనే యాబాలకులు విద్యావంతులై దొరతనమువారియొద్ద నుద్యోగము సంపాదించి సుఖించిరి.