పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

136

మహాపురుషుల జీవితములు

ములను రెండుసంపుటములుగఁ బ్రకటించి యీ మార్పుచేయుట యావశ్యకమని యందఱకుఁ దోఁచునట్లుచేసెను. మానమోహనుని వ్రాతలకును బలుకులకు 'సర్ చార్లసు ఇల్లియటు' అను బంగాళా దేశపు గవర్నరొక వార్తాపత్రికలో బ్రత్యుత్తరమిచ్చెను. ఆ దొరగారియుక్తులకుఁదగిన ప్రత్యుత్తరములు మానమోహనుఁడీ దలంచు చుండఁగనె వానినంతలో మృత్యుదేవత తన పొట్టం బెట్టుకొనియె 1896 వ సంవత్సరము అక్టోబరునెలలో మానమోహను ఘోషు స్వస్తానమగు క్రిష్ణఘరు నగరమున మృతినొందెను.

మానమోహనుఁడు కలసిమెలసియుండు స్వభావముగలవాడు. ఎదుటివారిమనసునొచ్చునేమొ యనుభయమున నతఁ డెల్లపుడు మృదుభాషియై దయాళుఁడై యుండెను. సర్వవిధములచేత నతఁడు సజ్జనుఁడని చెప్పవచ్చును. హిందువులయెడ నతని కెంతయాదరము గలదో విదేశీయులగు నాంగ్లేయుల యెడలనునం తేయాదరముగలదు. అతనియెడ వారిరువురకుఁ గూడ నంతెయాదరము గలదు. అతఁడు మృతినొందినపుడు 'నేషనల్ ఇండియన్ అస్సోసియేషన్‌' అను సంఘమువారు హిందువులను నాంగ్లేయులకు నైకమత్యము నొడ గూర్చుటలోను స్త్రీపురుషుల విద్యాభివృద్ధి చేయుటలోను మానమోహనఘోషు చాలశ్రమపడినాఁడని వానియెడల దేశస్థులు కృతజ్ఞులై యుండవలెనని యొకతీర్మానము వ్రాసిరి. అతఁడు చేసిన దానము లనేకములు గలవు. నిరుపేదలకు దోషులకును విద్యార్థి సంఘములకును సత్కార్యములకును ధనలోపముచేఁ బడిపోవుటకు సిద్ధముగ నుండు వార్తాపత్రికలకు మానమోహనుడు కల్పవృక్షమై యడుగుటయె తడవుగ ధనసహాయము చేయుచుండెను, మందభాగ్యుఁ డగు