128
మహాపురుషుల జీవితములు
నాకు నష్టములు తెచ్చినవారిమీఁద వ్యాజ్యములు తెచ్చితిని. కాని న్యాయవాదుల తెలివి తక్కువ వాదములచేత నా వ్యాజ్యములు పోయినవి. అందుచేతనే నేనే శాస్త్రములు చదువుకొని న్యాయవాదినై నా వ్యాజ్యముల నేనే వాదించెదను" అని చెప్పి న్యాయవాదియై యాపనిలో మిక్కిలి బుద్ధికుశలతఁ జూపి చాల ప్రసిద్ధి కెక్కెను. ఇట్లు కొంతకాలము జరిగినపిదప కలకత్తా కోర్టులో నిదివఱకు గవర్నమెంటు ప్లీడరుగానున్న యొకదొర పనిమానుకొని స్వదేశమునకుఁబోగా దొరతనమువారా యుద్యోగమును ప్రసన్నకుమారునికిచ్చిరి. ప్లీడరుపనివల్ల నతఁడుసంవత్సరంనకు లక్ష యేబదివేల రూపాయల నార్జించెను. ఆ ధనముతోడను సంస్థానమువల్ల వచ్చిన ధనముతోడను ప్రసన్నకుమారుఁ డనేక భూములను కొని జమీ చాల వృద్ధిపరచెను. శ్రీమంతులగు గొప్ప వంశస్థులలో నుద్యోగమునకు వచ్చినవారిలో నితఁడే మొట్ట మొదటివాడు. హిందూకళాశాలలో నతఁడొక సభికుఁడై దాని యభివృద్ధిని గూర్చి చాలపాటు బడియె.
తనకుమార్తెయు మనమరాలును విద్యావతులు గావలయునని సంకల్పించి యింటివద్ద వారికి విద్య నేర్పించెను. కొంతకాలముగడచిన పిదప ప్రసన్నకుమారుఁడు అనువాదక మనుపేర బంగాళీభాషలో నొక పత్రికను సంఘసంస్కారి యనుపేర నొక యింగ్లీషు పత్రికను బ్రకటింప నారంభించి సంఘసంస్కరణము రాజకీయ వ్యవహారము మతము విద్య మొదలగు విషయములంగూర్చి జనుల బుద్ధులు వికసించునట్లు మంచివ్రాతలను వ్రాయవచ్చె. రాజరామమోహనరాయలు సహగమనమును మానుపించవలసినదని చేసిన ప్రయత్నమునకు విరుద్ధముగా స్వేదేశస్థులు కొందఱు సహగమన ముండి తీరవలయునని దానిని మానుపింపఁ గూడదనియు నింగ్లాండు రాజు