పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/158

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
[17]
129
ప్రసన్న కుమార టాగూరుగారికిని పార్లమెంటు సభవారికి మహజర్లు వ్రాసిపంపిరి. కాని యా మహజర్లను లెక్క సేయక యింగ్లండు రాజుగారు సహగమనము చేయఁగూడదనియే శాసించిరి. అట్లు శాసించినందుకు శ్రీ రాజుగారికిని పార్లమెంటు మహాసభవారికిని జనులు కృతజ్ఞత దెలుపుటకై ప్రసన్నకుమారుఁ డొక పెద్ద సభచేయించెను. ప్రసన్న కుమారుఁడు మహాదాత. పూర్వము గొప్ప దశలోనుండి కాలవశమున పేదలై యభిమానము కింటనుండి యిడుమలఁ బడువారి కనేకులకు నెల నెలకు జీవితములిచ్చి సహాయములు చేయుచు వచ్చెను. తన సేవకులలో నెవరికి రోగమువచ్చినను వారి కౌషధములను గొనితెచ్చి వైద్యులచేత మందులిప్పించి వారిని బిడ్డలవలె గనిపెట్టు చుండును.

ఆయన పుస్తకభాండారము మిక్కిలి పెద్దది. అందు బహు గ్రంథములుండుటచే హైకోర్టు జడ్జీలు తక్కిన పెద్దమునుష్యులువిద్యార్థులు కావలసినప్పుడు స్వేచ్ఛగవచ్చి జదువుకొనుచువచ్చిరి. ఎల్లకాలము కలకత్తాలోనే వసియింపక ప్రసన్నకుమారుఁడు తరచుగ తన సంస్థానమునకుఁ బోయి చూచుకొనుచు వ్యవహార మంతయు దివానులమీఁదనే వదలివేయక రహితులతోఁ గలసి మాటలాడి వారి సుఖదుఃఖముల నెఱుఁగుచు వారి సౌఖ్యమునిమిత్తము వైద్యశాలలు గట్టించి రహితులకు భారమైనప్పుడు వారివద్దనుంచిపన్నులు పుచ్చుకొనక వారిని వేవిధములఁ గనిపెట్టెను. దొరతనమువారు హిందూ దేశ శిక్షాస్మృతి (ఇండియన్ పీనల్‌కోడ్డు) వ్రాయించినప్పుడు ప్రసన్నకుమారుఁడు వారికి మిగులఁ దోడ్పడియెను. గవర్నరు జనరలుగారి యాలోచనసభలో మొట్టమొదట సభ్యుఁడైనహిందువు డితఁడే కలకత్తా యూనివరుసిటీకి నతడు మూడులక్షలరూపాయలు