పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/116

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
93
కృష్ణదాస్‌పాలు

సంఖ్యగలదైవర్థిల్లెను. హరిశ్చంద్రముఖర్జి చనిపోయినతోడనే కృష్ణదాసు బ్రిటిషు యిండియన్ సంఘమునకు సహాయకార్యదర్శియై పిమ్మటఁ గొంతకాలమునకు ముఖ్యకార్యదర్శి యయ్యెను. హిందువులచే ప్రకటింపఁబడు పత్రికలలో ప్రధానమగుదాని కధిపతియగుట చేతను గొప్ప సంఘమునకు కార్యదర్శి యగుటచేతను కృష్ణదాస్ పాలుఁడు కొలఁది కాలములోనే యున్నతస్థితికి లేచెను.

1863 వ సంవత్సరమున నతఁడు మునిసిపల్ కమీషనరుగా నేర్పరుపఁబడెను. 1872 వ సంవత్సరమున నతఁడు బంగాళాదేశపు శాసన నిర్మాణసభకు సభ్యుఁడుగా దొరతనమువారివలన నియమింపఁ బడెను. 1877 వ సంవత్సరమున శ్రీవిక్టోరియారాణిగారు చక్రవర్తిని బిరుదము వహించినప్పుడు ఢీల్లీ నగరమున జరిగిన గొప్పదర్బారులో కృష్ణదాసుపాలునకు దొరతనమువారు రావుబహద్దరు బిరుదము నిచ్చిరి. మరుచటి సంవత్సరమున నతనికి సి. ఐ. యి. యను బిరుదము వచ్చెను. 1883 వ సంవత్సరమునం దాయన బ్రిటిషు యిండియన్ సంఘమువారిచేత గవర్నర్‌జనరల్ గారి శాసననిర్మాణసభకు సభ్యుఁడుగా పంపఁబడెను. ఈ యుద్యోగము లన్నిఁటిలోను కృష్ణదాసుపాలుఁడు మిక్కిలి పాటుపడి మంచిపేరు సంపాదించెను. కొంతకాలము దీర్ఘ వ్యాధిచే పీడింపఁబడి 1884 వ సంవత్సరము జూలై 24 వ తేదీని మృతినొందెను. పత్రికాధిపతిగా నున్న కాలమున విమర్శనము లేమియైన చేయవలసివచ్చినప్పు డతఁడు పక్షపాతము లేక మర్యాద నతిక్రమింపక చేయుచువచ్చెను. అట్టున్నను వానికొకసారి యధికారులతో వివాదము రాకతప్పినదిగాదు.

1866 వ సంవత్సరమున బంగాళా దేశమునకు గవర్నరుగా నున్న సర సిన్ డెన్ బీ దొరగారు కృష్ణదాసుపాలుఁ డప్పటి కరువును గురించి తన పత్రికలో వ్రాసిన కొన్నిసంగతులకు బహిరంగ