పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

94

మహాపురుషుల జీవితములు

మైన సభలో ప్రత్యుత్తరములు చెప్పిరి. 1874 వ సంవత్సరమున నప్పటి గవర్నరగు సర్ జార్జికెంబెల్ దొరగారు హిందూపేట్రియేటు దొరతనమువారియెడల ననిష్టముగల పత్రిక యని స్పష్టముగా వ్రాసిరి. అందుకు కృష్ణదాసుఁ డూరకొనక తగిన ప్రత్యుత్తరము వ్రాసి పంపెను. ఇట్లొకరిద్ద రధికారులు పత్రికపై నలుకబూనినను క్రమక్రమంబున దొరతనమువారా పత్రికపై నభిమానము వహించి హిందువుల యభిప్రాయము తెలుసుకొనుటకు తత్పత్రికయే ముఖ్యాధారమని యెఱింగిరి. కృష్ణదాసుఁడు గట్టి సామర్థ్యముతో పత్రిక నిరువదిమూడు సంవత్సరములు నడిపెను. గవర్నరు జనరలుగారి యాలోచన సభలో సభ్యుఁడుగా నుండిన యిల్బర్టు దొరగారు కృష్ణదాసుపాలుని పత్రికాధిపత్యమును గూర్చి యొకసారి యిట్లుచెప్పిరి. "తనతోటివారు పాఠశాలల విద్యార్థులుగా నుండునట్టి యీడుననే దేశమందు పురాతనమైన పత్రిక కధిపతియై కృష్ణదాసుపాలుఁడు సర్వతో ముఖమగు పాండిత్యముచేతను మిక్కిలి శాంతముచేతను నిష్పక్షపాత బుద్ధిచేతను 23 సంవత్సరములు పాటుపడి దక్షతలేక యణగిపోవుటకు సిద్ధముగానున్న పత్రికను మంచి యున్నతస్థితిలోనికి దెచ్చెను" ఆనాటి హిందువులలో నెవరికి నింగ్లీషుభాషయొక్క మర్మము కృష్ణదాసుపాలునకు దెలిసినంతగాఁ దెలియదని జనుల యభిప్రాయము. కలకత్తారివ్యూ యను పత్రికయొక్క యధిపతి కృష్ణదాసునిగురించి యిట్లు వ్రాసెను. "స్వచ్ఛమై మృదువై మనోహరమై యింగ్లీషువ్రాయను మాటలాడను నేర్చిన ప్రాచీనహిందువుల తెగ కృష్ణదాసుపాలునితో నంతరించినది. ఉపన్యాసము లిచ్చుటలోను వెనుదీయక వాదించుటలోను యితనికి మిక్కిలి సామర్థ్యము కలదు. హిందువులనేకు లింగ్లీషుభాషను చక్కగమాటలాటఁగలరు. కాని సందర్భసిద్ధియందును భాషాసౌష్టవమునందును హేతుకల్పము