92
మహాపురుషుల జీవితములు
నుండి కలకత్తానుండియే వ్రాయుచునుండెను. అప్పుడప్పుడు హిందూ పేట్రియాట్ పత్రికకుఁగూడ నతఁడు సంగతులనువ్రాసిపంపుటఁగలదు కనుక 1857వ సంవత్సరమున హిందూదేశమున బయలుదేరిన సిపాయి పితూరీని గురించి యెన్నో సంగతుల నతఁడు వ్రాసి పంప నాపత్రికాధిపతియగు హరిశ్చంద్రముకర్జీ వానివ్రాతనేర్పును జూచి దైవానుగ్రహమున నతఁడు చిరకాలము బ్రతికియుండె నా దేశమునకు మహోపకారము గలుగఁ గలదని తెలిసికొనెను.
పత్రికలకు వృత్తాంతములు వ్రాయుటయేగాక బంగాళాదేశ బాలకుల యోగ్యతాస్థాపన యను నంశమును గూర్చియు నీలిమందు వ్యవసాయమును గూర్చియు మఱికొన్ని యంశములఁ గూర్చియు నతఁడు చిన్న చిన్న గ్రంథముల వ్రాసెను. ఇందు మొదటి యుపన్యాసము కలకత్తా స్మాల్ కాజుకోర్టులో జడ్జీగారగు హరిశ్చంద్రగోషు గారి కంకితముచేయఁబడినందున నతఁడే కావలసినధనమిచ్చి దానిని ముద్రింపించెను. ఆ యుపన్యాసము బంగాళాదేశస్థుల మనస్సుల నాకర్షించుటచే నది మిక్కిలి బాగున్నదని కొన్ని పత్రికలును బాగులేదని కొన్ని పత్రికలును విమర్శింప నారంభించెను. తరువాత నా యుపన్యాసము వ్రాసిన యతఁడు 19 సంవత్సరముల వయస్సుగల విద్యార్థియని వార్తాపత్రిక మూలమున దేట పడినప్పుడు జనులంద ఱాశ్చర్యము నొందిరి. 1860 వ సంవత్సరమున హిందూపేట్రియేటు పత్రికాధిపతియగు హరిశ్చంద్రముఖర్జీ మృతినొందెను. అతని వెనుక నాపత్రిక యనేకుల చేతులలోఁబడి తిన్నగ జరుపఁ బడక యెట్ట కేలకు కృష్ణదాస్ పాలుని యధీనమయ్యెను. హిందూపేట్రియాట్ అనఁగా హిందూదేశభిమాని యని యర్థము. ఆపత్రిక కృష్ణదాస్ పాలు నాధిపత్యమునందు హిందువులచేఁ బ్రకటింపఁ బడునన్ని పత్రికలకంటె నెక్కువపేరు నెక్కువ చందాదారుల