పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/114

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
91
కృష్ణదాస్‌పాలునప్పుడు వానికిఁ గలిగిన యానంద మింతింతయని చెప్ప నలవిగాదు. కళాశాలలో విద్యాభ్యాసము ముగించిన వెనుక కృష్ణదాసొక జిల్లాజడ్జీ గారి కచ్చేరీలో ట్రాన్సులేటరు (అనఁగా ఇంగ్లీషునుండి స్వభాషకును స్వభాషనుండి యింగ్లీషునకును తర్జుమాచేయు నుద్యోగస్థుఁడు) గా నియమింపఁబడెను. కొన్నిదినము లతఁడు పని చేసిన వెనుక కృష్ణదాసు డాయుద్యోగమునకుఁ దగఁడని జిల్లాజడ్జివానిని తీసివేసెను. తరువాత సర్ విలియంగ్రె దొరగారు వానికిమంచి యుద్యోగము నొకటి యిచ్చిరి గాని యతఁడందుఁ బ్రవేశింపఁడయ్యె. అతఁడు గ్రంథములు వార్తాపత్రికలు మితిమీరునట్లు మిక్కిలి యాసక్తితోఁజదివియెక్కువ ప్రజ్ఞ గలవాఁడయినను వాని దారిద్ర్యము తెలివి తేటలను పైకి రానీక యణచిపెట్టెను. తానుచేరియున్న సమాజమునకు నెల నెల కియ్యవలసిన చందానైన నతఁడియ్య లేక పోవుటచే సమాజమువారు వానిం గరుణించి నెల చందా నియ్యనక్కర లేకుండఁ జేసిరి. ఆకాలమునం దతని యవస్థనెఱిగిన యతనిమిత్రుఁ డొకఁడు వానిఁగూర్చి యిట్లు వ్రాసియున్నాఁడు. కృష్ణదాసుఁడు కలకత్తాలో మారుమూల సందులో కూలిపోవుచున్న యొకపాడుకొంప యరుగుమీఁద చింకిరి చాపమీద గూరుచుండి పైచిల్లులలోనుండి సూర్యకిరణములు శరీరమునఁ దగులుచున్నను లెక్క సేయక పుస్తకములం జదువుకొనుచు పత్రికకు వృత్తాంతములు వ్రాయుచుఁ పెక్కుసారులు గనఁబడియె. అతఁడు పేదయయ్యు నున్నతస్థితికి వచ్చుటకు మిక్కిలి పాటుపడియె.

1857 వ సంవత్సరమున నతఁడుకొందఱు స్నేహితులసహాయమునఁ గలకత్తాలో నొకమాసపత్రికనుప్రకటింపఁజొచ్చెను, కానివాని దారిద్ర్యదోషమున నది యారుమాసములకే యంతరించెను. కాన్పూరునగరమున సెంట్రల్‌స్టార్ (మధ్యనక్షత్రము అని అర్థము) అనునింగ్లీషుపత్రికయొకటి బయలుదేరి కృష్ణదాసుఁడు దానికుప విలేఖకుఁడుగా