పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/93

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
74
ప్లూటార్కు వర్ణితచరిత్రలు


'ఆథెన్సు' పట్టణమునకుఁ బోయి క్షౌరముఁ జేయించుకొనుచు మంగలివానితో నీదుర్వార్తను జెప్పెను. పట్టణములో నా సంగతి తెలియనందున క్షౌరకుఁడు వెంటనే పట్టణములోనికిఁ బోయి యధికారులతో నీ సంగతిఁ జెప్పెను. వా రా వార్తను విశ్వసించక చెప్పినవానిని బట్టి తెప్పించి రూఢిగ తెలియని యీ దుర్వార్త నతఁడుఁ జెప్పినందు కతనిని శిక్షించిరి. ఇంతలో నిజము తెలిసెను. నాగరికులందఱు దుఃఖాక్రాంతులైరి. నిసియసు మొదలగు సేనాధిపతుల దుర్మరణమునకు వారు విలపించిరి. ప్రతి గృహములోను రోదనశబ్దము తప్ప మఱియొకటి వినఁబడదు. దుర్వార్తాశ్రవణముచేత నా దినము వారికి దుర్దినమయ్యెను. పడుచువారి ఆలోచనలను గ్రహించి, వృద్దుల దూరాలోచనలను నిగ్రహించినందున వారి కీ దురవస్థ సంప్రాప్తమై కొన్నితరములవఱకు 'అథీనియనులు' శిరస్సు నెత్తుకొని తిరుగలేదు. ఈ సంగతులు క్రీ. పూ. సం|| 413 రములో జరిగెను.

'నిసియస్సు' దూరదర్శియైనను, ప్రాక్తకాలజ్ఞుఁడు కానందున, నీ పరాభవము సమకూడెను. అందులో, సేనాధిపతి సంప్రాప్తకాలమునకుఁ దగినటులఁ బన్నాగములఁ బన్నుటకుఁ దగిన కుశాగ్రబుద్దిఁ గలిగియుండవలెను. అతఁడు నిసియసు వలె దీర్ఘాలోచనపరుఁడైన, శత్రువులు ,సమయము వేచియుందురు గనుక నతనిని పరిభవించుదురు, వారికి సమయ మతఁ