పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిసియస్సు

73


భారము లేని శత్రువుల నావలవలె సుళువుగ సంచరించుటకు సమర్థత లేకపోయి వేగముగఁ బట్టుపడెను. రాళ్లను రువ్వి శత్రువులు వీరి నావలను గొన్నిటిని ముంచివేసిరి. పట్టుపడిన నావలలోని వారు ఖైదలయిరి. అందులో నిసియస్సు యొక్క శ్రమలు చెప్ప లేము. అతఁడు వృద్ధు, రోగి, భోగి; అతని సలహాకు విరుద్దముగ నీ యుద్ధము జరిగెను. దాని ఫలితము నతఁ డనుభవింపవలసివచ్చెను. డెమాస్తనీసు (వక్త డెమాస్తనీసుకాఁ డితఁడు), ఫరాభవమును బొందలేక పొడుచుకొని చచ్చెను. శత్రువులు కనికరము చూపక వీరిని నఱకుచుండిరి. దీని కంతము కనఁబడ లేదు. శత్రు సేనాధిపతియైన 'గిలిప్ససు'ను కలిసికొని, దయాదాక్షిణ్యమును జూపుటకుఁ గాల మిదియే. మేము ధూసాయితులమైతిమి. మమ్ము కరుణించి మీరు మా కభయ మియ్యవలె"నని 'నిసియస్సు' ప్రార్థించెను. అప్పుడు యుద్ధముఁ జాలించవలసిన దని 'గిలిప్పసు' ఉత్తరువు చేసెను. అప్పుడు ' సిరాక్యూజ'నులు సభఁజేసి హతశేషులైన ఆథీనియనులను గనులలోఁ బనిఁ జేయుటకును వారి సేనాధిపతులఁ జంపించి వేయనలసినదనియు తీరుమానముఁ జేసిరి. ఆప్రకారముగ 'నిసియస్సు'ను రాళ్లతోఁ గొట్టి వారు చంపివేసిరి. గనులలో పనికిఁబోయిన 'అథీనియనులు' క్షుత్పిపాసాది బాధలచేత శ్రమపడి మడిసిరి. మఱికొందఱు బానిసలుగ శత్రువులచేత నమ్మఁబడిరి. ఒకఁడు