పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జూలియసు సీజేరు

45


సంగతి యతనికిఁ దెలిసెను. ఎంతవారికైననుఁ గొల మవిలంఘ నీయము!

ఒక రోజున 'బ్రూటసు' వచ్చి " ఏలినవారి కోరిక ప్రకారము పెద్ద లందఱు తమరికి పట్టాభిషేకముఁ జేయుటకు సిద్ధముగ నున్నారు. స్వప్నములను శకునములను సరకు సేయక తమరు విజయము చేయవలె"నని సీౙరుతో మనవిచేసేను. వెంటనే యతఁ డున్ముక్తకమును (Toga) ధరించి పల్లకీలో కూర్చొని సభామండపమునకుఁ బోవుచుండ, ప్రజలు గుంపులు గుంపులుగ నతని వెంబడించి పోయిరి. కుట్ర.సంగతి మార్గములో తెలుపుట కతనియొద్దకు కొందఱు వెళ్లఁ దలచినను, జనసమ్మర్దముచేత వారు సమీపింపలేకపోయిరి. సభామండపమునకుఁబోయి యతఁ డున్న తాసనము నధిష్ఠించెను. వెంటనే రాజద్రోహులు గుమిగూడి వారి వారి మిధ్యావిజ్ఞాపనల నొక్కుమ్మడి మనవిచేయసాగరి. ఇది చూచి యతఁ డాసనమునుండి లేవఁబోవ ద్రోహులలో నొకఁ డతని యున్ముక్తకమునుపట్టి దిగలాగెను. ఇతరులు వారి వారి ఛురికములతో నతనిని పొడువసాగిరి. కొంతవఱకు వారి బాఱినుండి తప్పించుకొ నెనుగాని 'బ్రూటసు'ను జూచి యతఁడు కండ్లుమూసికొనెను. ఇతఁడతని పరమమిత్రుఁడు. 'నీవుకూడ వీరలోఁ గలసితివా' యని సీౙరు .బ్రూటసుతోఁ బలికి, యిరువదిమూఁడు గాయములు తగిలినందున, దుర్బలుఁడై పాంపేయి యొక్క శిలాప్రతిమ సమీపమున