పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


నేలఁగూలెను. ఆ కాలమున భూమండలములో మహాపురుషుఁడని ప్రసిద్ధికెక్కిన జూలియసు సీౙరు దుర్మరణము నొందెను. లాటిను భాషను స్వచ్చముగ నుచ్చారణఁ జేయుట కతనికి శక్తికలదు. అంత విశేషముగ లేకపోయినను, కొంచె మతఁడు వక్తృత్వము కలవాఁడని చెప్పవచ్చును. సీౙరు భాష్యములను నేఁటివఱకును జదువుట కలదు. దండ నాయకులలో నతఁ డగ్రగణ్యుఁడు. మహా మంత్రులలో నతనికి మించినవారు లేరు. అతఁడు చేయవలసిన పనులలో నపజయము నెన్నఁడుఁ బొందలేదు. డాంబికము, మనోగర్వములు లేనందున నతఁడు మహా పురుషుఁడని చెప్పవచ్చును. అతఁడగ్రామ్యుఁడు, అగ్రీయుఁడు. శరీరము వ్యాధులచేతఁ గృశించినను, నతఁడలంకర్తయైయుండెను. కాలధర్మము ననుసరించి యతఁ డనుకుఁడు, నిశాటుఁడుగ నుండినను పరు లతని నిందించ లేదు. యుద్ధములో ననేకమందినిఁ జంపి కొందఱిని పట్టి కట్టి తెచ్చినను, నా కాలపు బుద్దిమంతులు దాని నొక తప్పిదముగ నెంచలేదు. చేయఁబూనిన కార్యమును చతురోపాయముగ మనశ్శంకలు లేక యతఁడు నిర్వర్తించెను. శత్రువులకు శృంగభంగము చేసి వారికి శిరచ్చేదము చేయక యతఁడు ప్రసాదించెను. వ్యవహారముల పొందికచేతఁ గాలాంతరమున ప్రజారాజ్యము కీలు వదలి, యేకరాజ్యాధిపత్యమునకు సందునిచ్చెను. ఈ తరములోఁ గాకపోయినను, నితని మేనకూఁతురుయొక్క.