పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


బదులుగ, నాఁటినుండి 365 కోజులు గలదిగ వాడుక కలిగెను. సూర్యమానము ప్రకారము 356 రోజులు గణించవలెను. అందుచేత నాలుగు సంవత్సరముల కొకపర్యాయము ఫిబ్రవరి నెలలో నొక రోజును కలుపు వాడుక నేఁటివఱకుఁ గలదు.

ఈ పనులలో నుండుటచేత నతఁ డొకరి దర్శనము చేయుటగాని యితరు లతని దర్శించుటగాని జరుగుట లేదు. అంతలోనే ప్రజ లసంతుష్ఠినిఁ జెంది, యతనిని నిర్లక్ష్యమునఁ జూడ నారంభించిరి.. ధనికులు సహిత మతనిపేరు చెప్పిన మండిపడుచుండిరి. ఇందుకు తోడుగ నతఁడు రాజని పిలిపించుకొనుట కిచ్చకల దని యొక వదంతికలిగెను. ప్రజా రాజ్యసంబంధనాణెములమీఁద నతని శిరోముద్ర వేసి వ్యావర్తములోనికిఁ దెచ్చిరి. 'సెనేటు' సభవా రతని యంగ రక్షణకు బాధ్యతను వహించిరి. అతని రాకపోకల సమయమున రాజలాంఛనములు జరుగుచుండెను. ఇన్ని మర్యాదలు పొందుచున్న నతఁడు వ్యసనగ్రస్తుఁడయ్యెను. పట్టాభిషేకమును పొంది. కిరీటమును ధరింపవలె నని యతఁడు కోరుచుండెను. రాజలాంఛనములను జూపుటకుఁ బ్రజ లిష్టపడిరి కాని ఆతఁడు రాజచిహ్నముల ధరించుటకు వా రిష్టపడలేదు. అందువలన, 'బ్రూటసు' అనువాఁడు నడుముకట్టి యితరుల సహాయముచేత నొక కుట్రను పన్నెను. . ఈలోపుగ సీౙరునకుఁ గొన్ని దుస్వప్నములు వచ్చెను; వినికిడివలన జరుగుచున్న కుట్ర