పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్లూటార్కు

11


సంఘములో నున్నపుడు, గృహస్థు ధర్మము నవలంబించి సాంఘికదేవ పితృఋణముల నతఁడు తీర్చెను. అతఁడు న్యాయాధికారిగఁ గొంతకాల ముండెను. “న్యాయాధికారి యెపుడును ప్రజల కష్టసుఖములను వినవలెను. అతఁ డార్తశరణ్యుఁడు గావలెను. అతని గృహము శరణాలయము” అని యతఁడు చెప్పెను. ప్రజారాజ్యము నతఁడు మన్నించెను. ప్రజలు స్వాతంత్ర్యముగ నుండవలె నని యతని యభిప్రాయము.

తత్వజ్ఞాని, చరిత్రకారుఁడు, న్యాయాధికారి - ఈ బిరుదులు యోగ్యముగ నతఁడు వహించెను, ఇఁక నతఁడు సంసారము నెట్లు గడిపెనో మనము చూడవలెను. నిస్సారమైన సంసారములో మనుజునియొక్క సారము తెలియును. అన్ని చదువుల సారము కూడినందున నతఁడు సంసారి..

సత్కులమందుఁ బుట్టుట దుర్లభము. పుట్టినతరువాత ననుకూలవతియైన గృహిణినిఁ బొందుట కష్టము. వీనిలో నేది లేకపోయినను, మనుజునికి సంకటమే; రెండును గలిగియున్న దానికంటె భాగ్యములేదు. అతఁడు సత్కులమునందుఁ బుట్టెను. అతని భార్య యోగ్యురాలు; భర్త కనుకూలముగ నడిచెను; పురుషార్థములను గుఱ్తెఱిఁగి దంపతులు గృహస్థు ధర్మమును నడిపిరి. ఆమె పేరు 'టైమాక్షి'. వారికి నలుగురు కుమారులు, నొక కొమరితయుఁ గలిగిరి. "నా కూఁతురు దాదియొద్ద పాలుత్రాగి కడమ పిల్లలకు పాలిమ్మని దాని నడుగు”నని ఫ్లూటార్కు