పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్లూటార్కు

9


వ్యర్థపుచ్చ లేదు. అందుచేతనే, భాషాపరిజ్ఞానము లేకపోయినను, సంభాషణలవలన ప్లూటార్కు మహనీయుల చారిత్రములను గ్రహించెను. కొంచెము వయస్సు ముదిరినపైని, లాటిను భాషను నేర్చుకొని, అందు వ్రాయఁబడిన రోమనుల చరిత్రము నతఁడు చదివెనుగాని చరిత్రములకుఁ గావలసిన ముఖ్యాంశములను సంభాషణలలోనె నతఁడు ప్రోగుచేసెను.

ఆకాలములో రోమునగరములోని మహనీయుల చేతను, ప్రాజ్ఞులచేతను మన్ననలను బొందుటయెకాక, రోము చక్రవర్తి 'ట్రాజను' చేతకూడ నతఁడు గౌరవ మందెను. అతఁడు చక్రవర్తికి గురువని కొందఱు, కాఁడని కొందఱు జెప్పుదురు. గొప్ప పండితుఁ డను పేరతనికి వచ్చెను. "బోద్ధారో మత్సర గ్రస్తా: ” అనునట్లు అతనిని జూచిన కొందఱికి శిరోభారముగ నుండెను. జ్ఞానులకు వచ్చు దురవస్థ యిదియె. జ్ఞానులను మనము తేరి చూడలేము (మేఘముచేత గప్పబడినప్పుడు తప్ప గ్రహరాజును చూడలేని విధమున).

జ్ఞానులకుఁ దగిన మర్యాదలను బొంది రోమునగరములో ధర్మము స్థాపించి, ప్రజలకు జ్ఞానోపదేశముజేసి, ట్రాజను చక్రవర్తిని సుగుణవంతునిగ నొనర్చి ప్లూటార్కు స్వదేశమునకు వచ్చి చేరెను. శిష్యుఁడైన చక్రవర్తి మరణము నొందినందున, నతఁడు దుఃఖంచి 'కైరోనియా' పట్టణమునకుఁ బోయెను. అక్కడ నివసించి, లౌకిక వ్యాపారములలో దిగక, ఏకాంత