పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


మునకు వచ్చితిని. మఱునాఁడు నిర్వహించుకొని వచ్చిన యంశమును సభలో ముచ్చటింపవలసి యున్నందున, నా తండ్రి “నేను, నేనని వాడుకచేయక, మేము కార్యము నెరవేర్చితిమని చెప్పిన, ప్రజలు నిన్నీర్ష్యతోఁ జూడ'రని నాతోఁ జెప్పె”నని ఫ్లూటార్కు వ్రాసెను.

'టైమను,' 'లెంప్రియను’ వీరిరువు రతని యన్నదములు. వీరు మువ్వు రత్యంత మైత్రిగ నుండిరి. అందులో 'డైమను'ను ప్లూటార్కు విశేషముగఁ బ్రేమించెను. “నే నదృష్టము గలిగి యున్నను, నాయన్న 'టైమను'యొక్క స్నేహము, దయకును బాత్రుఁడనైతినని ఫ్లూటార్కు వ్రాసెను. 'అంప్రియసు'కు తాతపేరు పెట్టినందున, నతనివలె నితఁడు సంతోష, ఫురుషుఁడు.

కొంతకాల మతఁడు దేశయాత్రలలో గడిపెను. ఈజిప్టు, ఇటాలియా దేశములలో నతఁడు తిరిగెను. ఇటాలియా దేశములోనుండిన దినములలో నతఁడు 'లాటిను' భాషను నేర్చుకొనుటకు సమయము దొరకలేదు గాని, రోమనులలో మహాపురుషుల జీవితచరిత్రలను వినుచుండెను. మొదట వస్తుజ్ఞానమఁ గలిగియున్నందున, వానిని నిరూపించు శబ్దముల నతడు 'లాటిను' భాషలో నేర్చుకొనెను.

ప్రకృతిలోని ప్రతివిషయము బుద్ధిని వికసింపఁ జేయనని యెంచి, వానినే ప్రసంగములలో 'రోమనులు' ముచ్చరించు చుండిరిగాని, 'కుక్కకూత' నక్కకూత'లలో 'వారు కామును